Prakash
కరీంనగర్ జిల్లా / బండి సంజయ్
2 లక్షల మెజారిటీ మార్క్ దాటిన బండి సంజయ్
అమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న బండి సంజయ్
భారీ మెజారిటీతో పట్టం కట్టిన కరీంనగర్ ప్రజలు
తొలిసారి 89,508 ఓట్లు మెజారిటీ ఇస్తే… నేడు మూడు రెట్లు అధికంగా మెజారిటీ కట్టబెట్టే దిశగా తీర్పు ఇవ్వబోతున్న ప్రజలు
కరీంనగర్ ప్రజలకు పాదాభివందనలు తెలిపిన బండి సంజయ్
ఈ విజయం కార్యకర్తలకే అంకితమన్న సంజయ్
మోదీ ఛరిష్మాతోనే ఇంతటి విజయం సాధ్యమైందని వెల్లడి
కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కార్యకర్తల మిన్నంటిన సంబురాలు
బీజేపీ జిందాబాద్… బండి సంజయ్ జిందాబాద్…మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు
మరి కాసేపట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బండి సంజయ్
ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి గెలుపు పత్రాన్ని అందుకోనున్న సంజయ్
భువనగిరిలోఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
యాదాద్రి భువనగిరి జిల్లా
భువనగిరి లోని అరోరా కాలేజ్ లో ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్న మునుగోడు ఎంఎల్ఏ, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కామెంట్స్:
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నీ అత్యధికంగా గెలిపించినందుకు భువనగిరి ప్రజలకు కృతజ్ఞతలు
కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి అంకితం
కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి, నా పేరు ను నిలబెట్టారు మీకు రుణపడి ఉంటా
కీసర హోలిమేరి కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్లో ఈటల రాజేందర్..
కీసర హోలిమేరి కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్లో ఈటల రాజేందర్.:
బీజేపీకి ఓటు వేసిన ప్రతిఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న.
మీ విశ్వాసానికి తగ్గట్టు పని విధానం ఉంటుంది.
మాకు రెండు కర్తవ్యాలు ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతాం.
మోదీ గారి ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తెస్తాం.
రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం.
17 సీట్లలో 8 సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నాం.
ఇది ప్రజల అశేర్వాదం.
దేశంలో 300 సీట్ల పైగా సీట్లతో దేశంలో మూడోసారి మోదీగారు అధికారంలోకి రాబోతున్నారు.
స్వేచ్ఛ స్వతంతం – ప్రగతి ఆత్మగౌరవం కోసం బీజేపీకి ఓటు వేశారు.
మోదీగారు ఈ పదేళ్లలో పేదవారికి డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారు.
యువతకి ఉద్యోగ అవకాశాలు కలిపించారు.
మౌలిక వసతులు ఏర్పాటు చేసారు.
భారత ఆత్మగౌరవం పెంచారు.
మోదీ హయాంలో బాంబుల మోతలు లేవు
నేను మల్కాజగిరి స్థానికుణ్ణి.
నామీద విశ్వాసం ఉంచి గెలిపించారు
ఏ రౌండ్ లో మేజారిటీ తగ్గకుండా ఓట్లు వేశారు.
కంటోన్మంట్ రోడ్స్, చెరువుల పునరుద్ధరణ, యువతకు ఉపాధి, పేదలకు ఇళ్ళు, ఇండస్ట్రియల్ కారిడార్,
అన్ని నెరవేరుస్తా.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా.
నోట్లో నాలుకలా ఉంటా.
నాకు సహకరించిన అన్ని సంఘాలకి కృతజ్ఞతలు.
కాంగ్రెస్ brs పార్టీలో ఉండి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.
నాకు ఓటు వేస్తే సేఫ్ గార్డ్ ఉంటుంది అని,
ప్రగతికి పునాది పడుతుంది అని ఓట్లు వేశారు.
అందరికే ధన్యవాదాలు.
అందరివాడిలా ఉంటా..
పొత్తుల సద్దిలా ఉంటా అని హామీ ఇస్తున్నా అని ఈటల అన్నారు.
పది సంవత్సరాల తరువాత కూడా దేశ ప్రజలు మోడీ గారిని కోరుకుంటున్నారు అంటేనే వారిపట్ల ఉన్న అభిమానం అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.
లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్న ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ..
పెద్దపల్లి జిల్లా:
రామగిరి జేఎన్టీయూ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
సుమారు లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ
వంశీకృష్ణ కామెంట్స్…
గత పది సంవత్సరాల కాలంలో పెద్దపెల్లి పార్లమెంటు అభివృద్ధిలో వెనుకబడిపోయింది
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తా
తన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మంత్రి శ్రీధర్ బాబుకు ,ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన వంశీకృష్ణ
నల్గొండ పార్లమెంట్ లో రికార్డ్ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి
ముగిసిన ఈవిఎం ల కౌంటింగ్
మొత్తం 24వ రౌండ్లు ముగిసేసరికి 5,52,659 ఓట్ల ఆధిక్యం లో రఘువీర్ రెడ్డి
కాంగ్రెస్ – రఘువీర్ రెడ్డి – 7,72,264
రెండవ స్థానం – బిజెపి – శానంపూడి సైదిరెడ్డి – 2,19,605
మూడవ స్థానం – బీఆర్ఎస్ – కంచర్ల కృష్ణారెడ్డి – 2,16,681
ఈవిఎం ఓట్లకు పోస్టల్ బ్యాలెట్ కలపాల్సి ఉంది




Total views : 92238