కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఆఫర్ చేస్తోందని అన్నారు. ఆపరేషన్ లోటస్ ద్వారా మాత్రమే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఇచ్చిన తీర్పుతో వారు ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. 2008, 2019లో ఆపరేషన్ కమలం, దొంగచాటు మార్గం ద్వారా అధికారంలోకి వచ్చారు అని సీఎం సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ పార్టీకి 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంత తేలిక కాదని సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.కర్ణాటక సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు. బీజేపీ అధికారంలోకి రావాలంటే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి రాజీనామా చేయాల్సి ఉంటుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవ్వరూ డబ్బుకు ఆశపడేవారు లేరని, ఈ మేరకు తనకు విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- అమీర్‌పేట్ మైత్రీవనంలో అగ్నిప్రమాదంమైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 92843