Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home National రాహుల్ గాంధీపై బెంగళూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ

రాహుల్ గాంధీపై బెంగళూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ

by Satya
Rahul Gandhi


రాహుల్ గాంధీపై స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ:

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28న కోర్టులో హాజరు కావాలని జడ్జి ఆదేశాలిచ్చారు. బీజేపీ పరువు తీసేలా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారంటూ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ఎస్.శివప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్..!

అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై 40 శాతం కమిషన్ ఆరోపణలు చేస్తూ పేపర్లలో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చారన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీని కూడా ఈ కేసులో సెక్షన్ 499, సెక్షన్ 500 కింద కక్షిదారుగా చేర్చాలని స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని సూచించింది.

Follow us on : Facebook, Instagram & YouTube.


నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: