జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించని షాకిచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, నవంబర్ 20న రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 41 సీట్లు అవసరం కాగా.. ప్రస్తుతం ఆ ఫిగర్‌ను కాంగ్రెస్ కూటమి క్రాస్ చేసి 57 స్థానాల్లో అధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ కూటమి 27 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ట్రెండ్ ఇలానే కొనసాగితే.. ఝార్ఖండ్ లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా, గండే నియోజకర్గం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ధన్వార్‌లో ఝార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి , సరాయ్‌కెలాలో జార్ఖండ్ మాజీ సీఎం చంపయీ సోరెన్ , ఇస్లాంపూర్‌లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.3 సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్…
- “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.…
- హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్,…
- ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు,…
- ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఐ బొమ్మ”. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి