చంద్రబాబు(Chandrababu)కు వయసు మీదపడ్డా.. బుద్ధి మారలేదని విమర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని(Perni Nani). చంద్రబాబు, పవన్‌ను తిట్టడానికే తనకు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపిస్తున్నారని ఫైరయ్యారు. తానెప్పుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan), చంద్రబాబుపై బూతులు మాట్లాడలేదన్నారు. చంద్రబాబు రాజకీయాలు, అసత్యాలపై మాత్రమే విమర్శలు చేశానని.. కానీ వ్యక్తిగతంగా బూతు వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. చంద్రబాబు బొంకు మాటలు, ఇచ్చిన హామీలపై వీడియో క్లిప్పింగ్స్ చూసుకోవచ్చని పేర్ని నాని విమర్శించారు.
ఇది చదవండి: ఎన్నికల నామినేషన్ల పర్వం..
చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని పేర్ని నాని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు అర్ధరహితమని నాని కొట్టిపారేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బందరు రూపు రేఖలు మారిపోయాయన్నారు. శిరోముండనం కేసు 1996లో జరిగితే ఇప్పుడు వైసీపీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తోట త్రిమూర్తులు ఏ పార్టీలో ఉన్నారో గుర్తు తెచ్చుకోవాలని పేర్ని నాని హితవు పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి