Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh డిసిసిబి కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన చినజీయర్ స్వామి

డిసిసిబి కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన చినజీయర్ స్వామి

by Rama
China jiyar swami

శ్రీకాకుళం జిల్లా ఆర్థికంగా వెనకబడినప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా ముందున్న జిల్లా అని చినజీయర్ స్వామి అన్నారు. నగరంలోని డిసిసిబి కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1988లో వేదాన్ని చదువుతూ శ్రీకూర్మం నుండి అనేక గ్రామాలను సందర్శిస్తూ పూరి వరకు పాదయాత్ర చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ ఏ అరిష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో పాదయాత్ర చేశామన్నారు. భక్తులందరి ముఖాలు చూస్తుంటే అధిక సంఖ్యలో వికసించిన తామర పుష్పాల వలె అందంగా ఉన్నాయన్నారు. జిల్లా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే తనకు చాలా ఆనందంగా ఉంటుందని చినజీయర్ స్వామి పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

040023
Total views : 203011

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: