Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh సీఎం జగన్ పర్యటన

సీఎం జగన్ పర్యటన

by Satya
CM Jagan

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేయనుంది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ పంపిణీని ప్రారంభించనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో హెలిపాడ్, సభా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అధికారులు పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: