Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం

పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం

by Rama
పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం

పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీ మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. గవర్నర్ ఆనంద బోస్ పై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “టిఫిన్ చేయడానికి డబ్బులు కావాలంటే నన్ను అడగండి.. నేను ఏర్పాటు చేస్తాను” అంటూ గవర్నర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇంతకూ గవర్నర్ పై మమతా బెనర్జీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు..? కొత్తగా అసెంబ్లీకి హజరైన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార సమయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, అందుకు గానూ వారు అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా, సభలో ఓటింగ్ లో పాల్గొనాలన్నా రోజుకు రూ.500 జరిమానా చెల్లించాలని గవర్నర్ ఆనంద బోస్ ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం ఈ ఆదేశాలు సీఎం మమతా బెనర్జీకి ఆగ్రహం తెప్పించాయి. గవర్నర్ ఆదేశాలపై బుధవారం సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. నీట్ కుంభకోణంలో నేరస్తులకు జరిమానా విధించని గవర్నర్.. అసెంబ్లీకి ఎన్నికైన వారికి మాత్రం జరిమానా విధిస్తారా..? మీ దగ్గర డబ్బులు లేవా..? టిఫిన్ చేయడానికి డబ్బులు కావాలంటే నన్ను అడగండి. నేను ఏర్పాటు చేస్తాను అంటూ వ్యాఖ్యానించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039188
Total views : 194611

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: