Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

by Satya
Election Result 2024

లోక్ సభ ఎన్నికల(Lok Sabha election) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అరగంట తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఈసీని కలిశారు. ఈ క్రమంలో, రూల్ 54A ప్రకారం అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. నిబంధనలకు అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియామావళి 1961లోని రూల్ 54ఏ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

543 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. ఇదిలా ఉండగా, మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే విపక్షాలు ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్నాయి. ఇండియా కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్ సభ సీట్లలో కూటమి ఎక్కువగా గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మాత్రం వైసీపీ ఏర్పాటు చేస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చునని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో వెలువడే ఫలితాల కోసం అందరూ వేచి చూస్తున్నారు.


  • గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.
    భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. గగన్‌యాన్ కోసం రూపొందించిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. మధ్యప్రదేశ్‌లో ఐఎల్-76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిర్వహించిన…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.
    పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి, భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అన్ని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

039806
Total views : 200875

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: