చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసగాడ్ని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఫకీర్ వేషం వేసుకొని మహిళలను దౌర్జన్యంగా డబ్బులు అడుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దండపల్లి రోడ్డు షాదీ మహల్ దగ్గర ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో ఫకీర్ వేషంలో వెళ్లి మహిళలను దౌర్జన్యంగా డబ్బులు అడుగుతున్న వ్యక్తిని స్థానికులు గమనించారు. మీ ఇంట్లో దోషం ఉంది.. మీరు కష్టాల్లో ఉన్నారంటూ మాయ మాటలు చెప్పి పదిహేను వందలు, పదమూడు వందలు, ఐదు వందల రూపాయల చొప్పున తీసుకుని పారిపోతుండగా స్థానికులు గమనించి అతడ్ని బంధించారు. అనంతరం పలమనేరు పోలీసులకు అప్పగించారు. మాయమాటలతో బురిడి కొట్టిస్తున్న ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ మోహన్ రెడ్డి సూచించారు. ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసగాడు అరెస్ట్.
316
previous post