Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Crime కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు.

కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు.

by CVR NEWS
కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు

కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం జరిగింది. చిన్నారితో పాటు మాయమైన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే, చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుని మండలం సి.హెచ్. అగ్రహారానికి చెందిన వ్యవసాయ కూలీలు గణేష్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర ఆడుకుంటూ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యమైంది. అప్పటి నుంచి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదు. ఐతే చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క తిరిగొచ్చి ఆందోళనగా ప్రవర్తించింది. చిన్నారి తల్లి భవాని చున్నీ పట్టుకుని లాగి, మళ్లీ సమీపంలోని గుట్టల వైపు పరుగెత్తింది.

ఈ పరిణామంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్‌తో కలిసి కుక్క వెళ్లిన దారిలో రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది. డీఎస్పీ తిలక్ నేతృత్వంలో వందలాది మంది పోలీసులు, సీఐలు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలోని జీడితోటలు, కొండ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో జల్లెడ పడుతున్నారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని ఇనుప కంచె వద్ద లభించిన చిన్నారి, కుక్క వెంట్రుకల నమూనాలను పోలీసులు సేకరించి పరీక్షలకు పంపారు. ఇదిలా ఉంటే.. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్‌ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. చిన్నారి ప్రమాదవశాత్తు కొండల్లోకి వెళ్లిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: