Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Crime మన్యం జిల్లా పాలకొండలో మాజీ వాలంటీర్ యువతి దారుణ హత్య కలకలం.

మన్యం జిల్లా పాలకొండలో మాజీ వాలంటీర్ యువతి దారుణ హత్య కలకలం.

by CVR NEWS

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఓ మాజీ వాలంటీర్ యువతి చివరకు చెరువులో శవమై తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.జంపరకోట పంచాయతీ బర్న సీతంపేట గ్రామానికి చెందిన 32 ఏళ్ల యువతి గతంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేసింది. ఈ నెల 6వ తేదీన పాలకొండకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె.. డోలమడ సెంటర్ వద్ద తన తమ్ముడు ద్వారా డ్రాప్ అయ్యింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.అనంతరం పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేయగా, కొన్ని గంటల్లోనే పాలకొండ మండలం తుమరాడ చెరువులో యువతి మృతదేహం లభ్యమైంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు.మృతదేహం చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి ఉండటంతో ఇది హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: