Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

by CVR NEWS
రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన అనే వివాహిత తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. అదే సమయంలో ఇంట్లోని బంగారం, నగదు మాయమవడంతో పోలీసులు మొదట దొంగతనం కోణంలో విచారణ ప్రారంభించారు. అయితే, ఘటన జరిగిన రోజు నుంచే ఆమె పదవ తరగతి చదువుతున్న మైనర్ కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసుల గాలింపులో సదరు మైనర్ బాలుడు, తన ఇంటర్ స్నేహితుడితో కలిసి పలాస, ముంబై, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సమాచారం లభించింది. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ గ్రౌండ్‌లో పరిచయమైన స్నేహితుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. తన ప్రేమ వ్యవహారాన్ని తల్లి మందలించి, ఆంక్షలు విధించిందనే కక్షతోనే స్నేహితుడితో కలిసి కన్నతల్లి ప్రాణాలు తీశాడని పోలీసులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039445
Total views : 196867

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: