Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Crime విధి నిర్వహణలో పక్షపాతం, నిర్లక్ష్యం….

విధి నిర్వహణలో పక్షపాతం, నిర్లక్ష్యం….

by Prakash
CS has suspended three police officers in Hyderabad

విధి నిర్వహణలో పక్షపాతం, నిర్లక్ష్యం వహించారని ఈసీ ఆదేశాల మేరకు.. హైదరాబాద్​లో ముగ్గురు పోలీసు అధికారులను సీఎస్‌ సస్పెండ్ చేశారు. సప్పెండ్ అయిన వారిలో సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్పెక్టర్ జహంగీర్​లు ఉన్నారు. మంగళవారం ఎన్నికల తనిఖీల్లో ఉన్న ఫ్లైయింగ్ స్క్వాడ్‌ ముషీరాబాద్​లోని.. సంతోష్ ఎలైట్‌ అపార్ట్​మెంట్లో డబ్బులు పంచుతున్నారని సమాచారం వచ్చింది. అక్కడి చేరుకున్న ఎఫ్‌ఎస్‌టి బృందాన్ని చూసి స్థానికులు పరారయ్యారు. అక్కడే నిలిపి ఉన్న AP 28 CH 6759 నంబరు గల కారులో 18లక్షలు, చెక్‌బుక్‌, 2సెల్‌ఫోన్​లను ముషీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కారు, నగదు ముషీరాబాద్ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ముఠా గోపాల్ కుమారుడు ముఠా జైసింహదిగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్​లో నిందితుల పేర్లు మాత్రం గుర్తు తెలియని వారివిగా నమోదు చేశారు. సెక్షన్లు కూడా సరైనవి పెట్టలేదు. కాగా ఈ విషయంపై సీపీ సందీప్ శాండిల్యా ఆరా తీయగా.. సదరు కేసులో ముఠా గోపాల్ స్నేహితులు సంతోష్‌, సుధాకర్​ను అరెస్ట్ చేసినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో ఘటనపై దృష్టి సారించిన ఈసీ.. ముషీరాబాద్ ఇన్​స్పెక్టర్​ జహంగీర్‌, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయాలని సీఎస్​ను ఆదేశించింది. దీంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ముషీరాబాద్ ఇన్పెక్టర్​గా అదే స్టేషన్​లో పనిచేసే డీఐ వెంకట్ రెడ్డి నియామిస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులిచ్చారు. సెంట్రల్​ జోన్ డీసీపీగా ప్రస్తుతం టాస్క్​ఫోర్స్ డీసీపీ నితిక పంత్‌ లేదా ట్రాఫిక్ డీసీపీ -2 గా ఉన్న అశోక్‌ కుమార్, లేదా ట్రాఫిక్ డీసీపీ-3 గా ఉన్న డి శ్రీనివాస్‌ లను నియమించే అవకాశం ఉందని తెలిపారు. చిక్కడ పల్లి ఏసీపీగా ఎన్నికల కోడ్​లో బదిలీ కాని అధికారి నియమితులు అవుతారని సీపీ శాండిల్య వెల్లడించారు.

Advertisements

You may also like

Our Visitor

039775
Total views : 200808

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: