మండల పరిధిలోని శాఖవరం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో పోకూరు శాకవరం రహదారిలో గడ్డం గోవిందమ్మ నివాస సమీపంలో గ్రామానికి చెందిన చుంచు శివకృష్ణ(34) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు పలు విధాలుగా ఉన్నాయి. గ్రామానికి చెందిన శివకృష్ణ సోమవారం రాత్రి పోకూరు గ్రామానికి చేరుకొని 12 గంటల వరకు మద్యం సేవించి కాలినడకన గ్రామానికి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 12 గంటల సమయంలో రహదారిపై ఆయన పడిపోయి ఉండటం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా మృతదేహాన్ని చూసి నివాసానికి వెళ్ళినట్లు మంగళవారం ఉదయం నాలుగు గంటలకు మృతదేహం వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. కందుకూరు సీఐ సుబ్బారావు లింగసముద్రం ఎస్సై బాజీ బాబు పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని తల్లి దండ్రులు సుబ్బారావు రవణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు అందజేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. అయితే స్థానికుల నుండి పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. శివకృష్ణకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఈ నేపథ్యంలోనే పొగ తోటలో హత్య చేసి రహదారిపై పడవేసి ఉంటారని అనుమానాలు ఉన్న ఎలాంటి వివరాలు లభించడం లేదు. మరోవైపు నోటి నుండి చూస్తుంటే ఇది మృతి హత్య లేక ప్రమాదం తోజరిగిందా పోస్టుమార్టం నివేదిక వస్తే తేటతెల్లమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Crime
ఇజ్రాయెల్(Israel):
ఇజ్రాయెల్(Israel) పై లెబనాన్ టెర్రర్ గ్రూపు జరిపిన క్షిపణి దాడిలో భారతీయుడు మృతి చెందారు. మరో ఇద్దరు భారతీయులకు తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వ్యక్తి సహా గాయపడ్డ ఇద్దరూ కేరళవాసులని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నార్తరన్ ఇజ్రాయెల్(Israel) లోని మార్గలియత్ పై నిన్న క్షిపణి దాడి జరిగింది. లెబనాన్ వైపు నుంచి దూసుకొచ్చిన మిసైల్ వ్యవసాయ క్షేత్రంలో పడడంతో భారీ పేలుడు సంభవించింది.
ఇది చదవండి: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం..!
ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం.. బాధితులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించింది. ఈ దాడిలో కేరళ(Kerala)లోని కొల్లాంకు చెందిన మాక్స్ వెల్ చనిపోయాడు. ఇడుక్కి జిల్లా వాసి పాల్ మెల్విన్ తో పాటు బుష్ జోసెఫ్ లకు చికిత్స అందిస్తున్నామని బెయిలిన్సన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.
జనగామ పోలీసులు (Janagama Police)
తేదీ: 03/03/2024 రోజున సాయంత్రం 05:30 గంటలకు సృజన్ SI పెంబర్తి ‘వై’ జంక్షన్ వద్ద వెహిక్లీ చెకింగ్ చేస్తుండగా ఒక బబాజ్ మాగ్చిమ ఆటో హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వస్తూ వారు పెంబర్తి ‘వై’ జంక్షన్ వద్ద మమ్మల్ని చూసి వెనుకకు తిప్పుకొని పారిపోతుండగా జనగామ పోలీసు లు పట్టుకొని వారిని విచారించగా వారు చేసే పని ద్వారా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో నేరస్తులు అందరూ అమాయక ప్రజలకు మోసం చేయాలనే ఉద్దేశముతో వారి వద్ద ఆకాశం నుండి ఉల్కలు తెగిపడినప్పుడు ఒక అద్భుతమైన పెట్టి దొరికినదని దానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని అది ఎవరి దగ్గర ఉంటే వారు కోటీశ్వరులు అవుతారని వాళ్ళు జాతకం మారిపోతుందని మరియు మంచి జరుగుతుందని ఆ పెట్టెను 50 కోట్ల రూపాయలకు అమ్మాలని నిర్ణయించుకున్న మనీ, అట్ట పెట్టెను వరంగల్ కు చెందిన వ్యక్తి కొంటాడని తెలిసి, వారు ఆ మహిమ గల పెట్టెను ఆటో నెంబర్ TS-30-TA- 5631 Bajaj Maxima గలదానిలో పై నలుగురు వ్యక్తులు హైదరాబాదు నుండి వరంగల్ కు వస్తుండగా పెంబర్తి Y జంక్షన్ వద్ద పోలీసు వారిని పట్టుకున్నారు. అనంతరం జనగామ SI సృజన్ గారి పిర్యాదుపై ఇన్స్పెక్టర్ జనగామ L.రఘు కేసు రిజిస్టర్ చేసి నేరస్తులను అరెస్టు చేయడమైనది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఎస్సై దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
03.03.2024 రోజున సాయంత్రం 05.30 గంటలకు సృజన్ SI పెంబర్తి ‘వై’ జంక్షన్ వద్ద వెహిక్లీ చెకింగ్ చేస్తుండగా ఒక బజాజ్ మాగ్చిమ ఆటో హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వస్తు వారు పెంబర్తి ‘వై’ జంక్షన్ వద్ద మమ్మల్ని చూసి వెనుకకు తిప్పుకొని పారిపోతుండగా జనగామ పోలీసులు పట్టుకొని వారిని విచారించగా వారు చేసే పని ద్వారా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో నేరస్తులు అందరూ అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశముతో వారి వద్ద ఆకాశం నుండి ఉల్కలు తెగిపడినప్పుడు ఒక అద్భుతమైన పెట్టి దొరికినదని దానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని అది ఎవరి దగ్గర ఉంటే వారు కోటీశ్వరులు అవుతారని వాళ్ళ జాతకం మారిపోతుందని మరియు మంచి జరుగుతుందని ఆ పెట్టెను 50 కోట్ల రూపాయలకు అమ్మాలని నిర్ణయించుకున్న మనీ, అట్టి పెట్టెను వరంగల్ కు చెందిన వ్యక్తి కొంటాడని తెలిసి, వారు ఆ మహిమ గల పెట్టెను ఆటో నెంబర్ TS-30-TA- 5631 Bajaj Maxima గలదానిలో పై నలుగురు వ్యక్తులు హైదరాబాదు నుండి వరంగల్ కు వస్తుండగా పెంబర్తి Y జంక్షన్ వద్ద పోలీసు వారు పట్టుకున్నారు. అనంతరం సృజన్ SI జనగామ గారి పిర్యాదుపై ఇన్స్పెక్టర్ జనగామ L.రఘు కేసు రిజిస్టర్ చేసి నేరస్తులను అరెస్టు చేయనైనది.
పోలీసులు వాహన తనిఖీలు(Police Checks)
చిత్తూరు Chittoor, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం పోలీసులు వాహన తనిఖీలు. తనిఖీలలో భాగంగా కోటి 9 లక్షల,44 వేల రెండు వందల రూపాయల నగదు స్వాధీనం. కార్వేటినగరంలో సోమవారం సాయంత్రం పోలీసులు తమ విధులలో భాగంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎస్సై వెంకటకృష్ణ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా 1 కోటి 9 లక్షల,44 వేల 200 రూపాయల నగదు ను మరియు ఆ నగదును తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. నగిరి డిఎస్పి పవన్ కుమార్ కార్వేటి నగరం సర్కిల్ సీఐ సత్య బాబు, ఆధ్వర్యంలో తిరుపతి అసిస్టెంట్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కు నగదును పంపిస్తున్నట్లు తెలిపారు. ఆర్కే పేట నుండి పుత్తూరు కు తరలిస్తున్న సుందరం సుధాకర్ నగదును పట్టుకున్న పోలీసులు
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తక్కళ్లపల్లి (Takkallapally) :
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి (Takkallapally)లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. మూడేళ్లపాటు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ప్రేమ వ్యవహారంలో ఘర్షణ కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే పెగడపెల్లి మండల కేంద్రంకు చెందిన భోగ మహేష్(28) అనే యువకుడు తాను ప్రేమించిన యువతి కోసం ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడిపై యువతి కుటుంబ సభ్యులు ముందుగా మహేష్ తో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ గొడవ కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దీంతో మహేష్ వెంట తెచుకున్న కత్తితో యువతి తల్లి సత్తమ్మ తో పాటు తాతపై నర్సయ్య పై దాడికి దిగాడు. అయితే, కుటుంబ సభ్యులంతా ముకుమ్మడిగా మహేష్ పై దాడి చేయడంతో అతడు అక్కడకక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ 108 వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మల్యాల సిఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ రహీమ్ పాషా హత్య ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసుల్లో చట్ట సభ్యులకు ఎలాంటి మినహాయింపు ఉండదని చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చట్ట సభల్లో ఓటు వేయడానికి, ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్న కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తూ 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా పక్కన పెట్టేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పార్లమెంటరీ అధికారాల ద్వారా లంచం రక్షింపబడదని పేర్కొన్న న్యాయస్థానం.. 1998 నాటి తీర్పు వివరణ రాజ్యాంగంలోని 105, 194 ఆర్టికల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధులు భయం లేకుండా పనిచేసేందుకు ఈ రెండు అధికరణలు వారికి ప్రాసిక్యూషన్ నుంచి చట్టపరమైన మినహాయింపును అందిస్తాయి. పీవీ నరసింహారావు కేసు తీర్పుతో తాము విభేదిస్తున్నట్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. పార్లమెంటులో ఓటు వేసేందుకు, లేదంటే ప్రసంగించేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై చట్టసభ్యుడికి మినహాయింపునిస్తూ ఇచ్చిన తీర్పు విస్తృత పరిణామాలు కలిగి ఉందని, కాబట్టి దానిని రద్దు చేసినట్టు సీజేఐ స్పష్టం చేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఇండస్ట్రియల్ బెడ్స్ అండ్ మెత్తలు తయారీ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్(Fire Accident)…
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో బెడ్స్ మెత్తల తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం రోజు దాదాపు 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. గమనించిన స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు… సమాచారం అందుకున్న అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొనిమంటలు అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కృష్ణాజిల్లా, పెనమలూరు(Penamaluru) నియోజకవర్గం
వణుకూరులో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతి. వణుకురులో గుర్తుతెలియని మహిళ హత్య జరిగింది అనే సమాచారంతో పెనమలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ ఒంటిపైన ఎలాంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా ఉండటంతో పాటు బాడీ పైన అక్కడక్కడ గాయాలు కనపడడంతో హత్యగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ మహిళా మృతదేహం ఎవరిది అన్నది ఇంకా తెలియ రాలేదు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పెనమలూరు సిఐ రామారావు మాట్లాడుతూ…
స్థానికంగా ఉన్న గొర్రెల కాపరుల ఇచ్చిన సమాచారంతో హత్యకు గల కారణాలు క్లూస్ టీమ్ , డాగ్స్ స్కాడ్ సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలు వయసు సుమారు 35-40 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. త్వరితగతిన కేసు పురోగతి సాధిస్తామన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఈనాడు(Eenadu) కార్యాలయం 4వ అంతస్తూ నుండి దూకి మహిళ ఆత్మహత్య
రామోజీ ఫిల్మ్ సిటీ లోని ఈనాడు కార్యాలయం 4వ అంతస్తూ నుండి దూకి మహిళ ఆత్మహత్య. ఈనాడు ఫోర్త్ ఫ్లోర్లో కాల్ సెంటర్లో పని చేస్తున్న మహిళ (సాయికుమారి). ఆమె భర్త కూడా ఈనాడులోనే ఈనాడు సంస్థలోనే పనిచేస్తున్నట్లు గుర్తింపు. మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు సంతానం. ఆత్మహత్య కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి