ఉరిటి స్వప్న ప్రియ, సురేష్, మరో ఆరుగురు ఉద్యోగులు గోల్డ్ గోల్ మాల్ కేసులో ఉన్నారు.. ఈ కేసులో 86 బ్యాగ్ లు మాయమయ్యాయి అని, అందులో 26 బ్యాగులను ఉద్యోగులు వెనక్కి ఇచ్చారని పోలీసులు తెలిపారు. లోహిత కన్సల్టెన్సీ తిరుమల రావు స్వప్నప్రియతో పరిచయం పెంచుకుని గోల్డ్ ని మళ్లించారని, సిట్ ను ఏర్పాటు చేసి రెండు బృందాలతో దర్యాప్తు చేశామని తెలిపారు. లోహిత కన్సల్టెన్సీ తిరుమలరావు ను అరెస్ట్ చేశామని, బ్యాంక్ ఉద్యోగి సురేష్ పరారీలో ఉన్నాడని అన్నారు. సంవత్సర కాలంగా గోల్డ్ ని బయటకు మల్లించి.. ప్రైవేట్ బ్యాంకులైన సి ఎస్ బి, ఫెడరల్ బ్యాంక్ లలో బినామి పేర్లతో నిందితులు గోల్డ్ ను తాకట్టు పెట్టేవారని అన్నారు. డిప్యూటి మేనేజర్ స్వప్న ప్రియ, సోదరుడు కిరణ్ వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ లో పెట్టేవాడిని అన్నారు. తాను దొరికిపోయాను అని తెలుసుకున్న డిప్యూటి మేనేజరు స్వప్నప్రియ సిగ్గుతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సి ఏస్ బి,ఫేడరల్ బ్యాంక్ అధికారులతో సహా 7 గురుని అరెస్ట్ చేసామని, బ్యాంక్ ఉద్యోగి సురేష్ కోసం గాలిస్తున్నామని, బ్యాంక్ లో మాయమైన 7 కేజీల 195 గ్రాముల గోల్డ్ ను పూర్తిగా రికవరీ చేశామని తెలిపారు.
Crime
జిల్లా ఎస్పీ యూ.రవి ప్రకాష్ ఆదేశాల మేరకు పెనుగొండ లో రాత్రి పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లలో జరుగుతున్న దొంగతనాల కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని పెనుగొండ పోలీసులు అరెస్టు చేసారు. నరసాపురం ఇంఛార్జి sdop జీ.వీ.ఎస్ పైడేశ్వరరావు పెనుగొండ పోలీసు స్టేషన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెనుగొండ గ్రామంలోని చెరుకువాడకు చెందిన కోసూరి కరుణ (33సం) జల్సాలకు అలవాటు పడి రాత్రి పూట తాళాలు వేసిన ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం, మరియు వెండి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంతే కాకుండా బైక్ లు దొంగతనాలకు కూడా పాల్పడేవాడని దొంగిలించిన వెండి, బంగారం వస్తువులను ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి తన అవసరాలకు ఉపయోగించుకునేవాడని తెలిపారు. పెనుగొండ ఇన్స్పెక్టర్ మరియు ఆయన సిబ్బందితో మరియు మధ్య వర్తులతో తేదీ.08-12-2013 తేదీన చెరుకువాడలో ముద్దాయి ఇంటి వద్ద సుమారు 5 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని విచారించగా తన నేరచరిత్ర అంతా బయటపడింది. పట్టుబడిన కోసూరి కరుణ గత ఎనిమిది నెలల నుండి పాలకొల్లు మరియు పలు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది .అతని నుంచి సుమారు 12.5 కాసుల బంగారం, ఒక కేజి వెండి ఒక మోటార్ సైకిల్ రూ. 8,00,000 లక్షల విలువగల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలందరూ మోటార్ సైకిళ్ళుకు జీపీఎస్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఇళ్లల్లో ఉన్న బంగారం మరియు నగదును వీలైనంత మేర బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ఫైనాన్స్ కంపెనీల్లో దొంగతనాలకు ప్రయత్నిస్తున్న ఓ దుండగుడును పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని సిసిఎస్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు చేరుకుని దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ సిసిఎస్ సిబ్బందితో సంఘటనా స్థలాలకు చేరుకుని సంఘటనలు జరిగిన తీరును పరిశీలించారు. ఐదో తారీకు అర్ధరాత్రి ముత్తూట్ ఫైనాన్స్ చోరీకి ప్రయత్నించిన దుండగుడు, ఎనిమిదో తారీకు అర్ధరాత్రి ఫైనాన్స్ కంపెనీలో చోరీకి ప్రయత్నించిన దుండగుడు, రెండు చోట్ల చోరీకి ప్రయత్నించిన వ్యక్తి మంకీ క్యాప్ ధరించి ఉన్నట్లు సిసి ఫుటేజ్ ల ద్వారా పరిశీలిస్తున్న పోలీసులు, రెండు ఫైనాన్స్ కంపెనీల వద్ద స్థానిక పోలీసులతో కలిసి వివరాలు సేకరిస్తున్న ఏలూరు సిసిఎస్ పోలీసులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని లాడ్జిలలో చెక్ చేస్తున్న నూజివీడు పట్టణ పోలీసులు, రెండు నేరాలలో ఒకే వ్యక్తి పాల్గొన్నట్టు నిర్ధారణకు వచ్చిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్.వి. మురళి కృష్ణ టెక్నికల్ ఆధారాలు సేకరించి దర్యాప్తు వేగవంతం చేసి ముద్దాయిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకుల వద్ద, ఫైనాన్స్ కంపెనీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ నియమించుకోవాలని, నష్టం జరిగాక ఇబ్బంది పడే దానికన్నా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్.వి.మురళీకృష్ణ సూచించారు.
Read Also…
Read Also….
భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానంతో భార్య తల నరికిన సంఘటన గురువారం రాత్రి రొంపిచెర్లలో చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రొంపిచెర్ల గ్రామపంచాయతీ, పాలెం వీది కి చెందిన వాహిదా (32) పీలేరుకు చెందిన ఖాజా కిజర్ (42) ఇరువురు 14 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తుండేవాడు. అయితే మూడు సంవత్సరాల క్రితం భర్త ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో నడుపుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో వారం రోజులుగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు కత్తితో భార్య తల మీద నరికి వేశాడు. దీంతో పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను అతని నుండి విడిపించి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరీక్షించి, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారని తెలియజేశారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణయ్య తెలిపారు.
హన్మకొండజిల్లా మెటర్నిటీ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టోర్ రూం లో షార్ట్ సర్క్యూట్ అవ్వటం వలన, యాసిడ్ బాటిల్స్, బ్లీచింగ్ పౌడర్ ఉన్న గదిలో ఈ ప్రమాదం జరిగింది, హాస్పిటల్ ఆవరణ మోత్తం నల్లటి పొగలతో నిండింది. దీంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Read Also..
Read Also..
కొమురం భీం జిల్లా అసిఫాబాద్ మండల బూరుగుడా గ్రామ సమీపంలోని, గిరిజన మహిళ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలని హాస్టల్ నుండి దాదాపు 2 నుండీ 3 కిలోమీటర్ల పరుగులు తిస్తు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థినులు ప్రిన్సిపల్ తమపై దురుసుగా ప్రవర్తిస్తుందని, తమతో అసభ్యకరంగా మాట్లాడుతుందని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ కొడకంచి శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ప్రాంతాన్ని ఎస్ ఓ టి పోలీసులు. గుర్తించారు గత 6నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫా జోలం, హేరైన్, కోకైన్, పలు రకాల డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎస్ ఓ టి పోలీసులు అక్రమంగా డ్రగ్స్ తయారుచేస్తున్న ప్రాంతంపై నిఘా పెట్టారు.అదునుచూసుకున్న పోలీసులు డ్రగ్ తయారీ కేంద్రంపై చాకచక్యంగా వ్యవహరించి 14 కిలోల ఆల్ప్రా జోలం ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ బిఆర్ఎస్ జిల్లా నేత కనుసన్నల్లో ఈ డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్ తయారి కేంద్రం వద్ద ఐదుగురు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహ్మద్ యూనస్ ఆలియాస్ జక్కరాజు, బోరపట్ల,శ్రీనివాస్ గౌడ్,గ్రామం గుండ్ల,మ్యాచునుర్, నిర్మల్ గౌడ్, గ్రామం కొడకంచి, మణిక్యల రావు, గ్రామం ఇస్సాపూర్
శివశంకర్ గౌడ్, గ్రామం కొడకంచిరాహుల్ రెడ్డి, గ్రామం బిరంగుడ , శ్రీశైలం యాదవ్, గ్రామం గుండ్లమాచునుర్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎస్ పి చెన్నూరు రూపెష్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
గోకవరం మండలం కొత్తపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. జువెలరీ షాప్ కి వెనుకనుండి కన్నం పెట్టి మరి దొంగలించారు. గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వేకవరపు వెంకట దుర్గా ఉమామహేశ్వర జువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు. గత అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి 10 కేజీల వెండి 16 గ్రాముల బంగారం చోరీ జరిగిందంటూ పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల సమక్షంలో క్లోస్ టీం సహాయంతో షాపులోని వేలిముద్రలు సేకరించారు. అలాగే సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకుంటామని కేసు దర్యాప్తు వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.
Read Also….
Read Also….
పుంగనూరు రొంపిచెర్ల (మం)..అనుమానంతో భార్య తలపై నరికిన భర్త.
భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త భార్య తల నరికిన సంఘటన గురువారం రాత్రి రొంపిచెర్లలో చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…రొంపిచెర్ల గ్రామపంచాయతీ, పాలెం వీది కి చెందిన వాహిదా (32) పీలేరుకు చెందిన ఖాజా కిజర్ (42) ఇరువురు 14 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తుండేవాడు. అయితే మూడు సంవత్సరాల క్రితం భర్త ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో నడుపుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో వారం రోజులుగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు కత్తితో భార్య తల మీద నరికి వేశాడు. దీంతో పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను అతని నుండి విడిపించి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరీక్షించి, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారని తెలియజేశారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణయ్య తెలిపారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం లోని గ్రీన్ ల్యాండ్ అనే ప్రవేట్ లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు గత మూడు రోజులుగా అదే లాడ్జి రూము నెంబర్ 105 లోనే బస చేసాడు. రెండు రోజులుగా అద్దె డబ్బులు కట్టకపోవడంతో తెల్లవారుజామున అద్దె కోసం రూమ్ బాయ్ తలుపులు తెరిచి చూడగా వ్యక్తి మృతి చెంది వికటజీవిగా పడి వున్నాడు. దీనితో లాడ్జ్ వాళ్ళు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన రాజశేఖర్ రావు, వయసు 44 సంవత్సరాలుగా గుర్తించారు. మృతుడు గత కొద్ది సంవత్సరాలుగా కుటుంబాన్ని వదిలి శ్రీశైలంలో పలు హోటల్లో పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కరికి రూమ్ ఇవ్వకూడదని ఒకవేళ ఇచ్చిన అందుకు స్థానిక పోలీసుల పర్మిషన్ కావాలని తెలిసిన కూడా రూల్స్ కి వెతిరేకంగా రూమ్ ఇవ్వడంపై పలు అనుమానాలు తవిస్తున్నాయి. అనుమానస్పద మృతి ఘటనపై కేసు నమోదు చేసిన సుండిపెంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.