తిరుపతి అటవీప్రాంతం పరిధిలో పోలీసులు10 మంది ఎర్రచందనం దొంగలను అరెస్టు చేసారు. భాకరాపేట రేంజ్ లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా పోలీసులు దోంగలను పట్టుకున్నారు. 306 కిలోల ఎర్రచందనం దుంగలను, రెండు కార్లు, ఒక మోటారు సైకిల్ ను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూర్ జిల్లాకు చెందిన ఇద్దరు స్మగ్లర్లు, 8 మంది కూలీలును పోలీసులు అరెస్టు చేసారు.
Crime
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన వైనం. తాడేపల్లిగూడెం నుండి గుంటూరు వైపు వెళ్లే తరుణంలో చిన్న అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు గుంటూరు వాసులుగా కార్తీక్ (19) వెంకట్ (30)గా గుర్తింపు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు సమీపంలోని చిన్న అవుటపల్లి పిన్నమ నేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది రోడ్డుపై ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయం తో సమాచారం అందుకున్న ఆత్కురు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ గర్భంలోని శిశువు మరణించిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. బోయినపల్లి మండలం జగ్గారావుపెల్లి కి చెందిన తిప్పరవేని చందు- అమూల్యలకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా, తొలి కాన్పు సమయం కావడంతో వేములవాడ ఏరియా హాస్పిటల్ మూడు రోజుల క్రితం అడ్మిట్ కాగా, ఆపరేషన్ చేయాలని అమూల్య బంధువులు ఎంత వేడుకున్నా డాక్టర్లు మాత్రం పట్టించుకోకుండా ఆపరేషన్ చేయాలంటే అనస్తీషియా అందుబాటులో లేడని, ఆపరేషన్ చేసే డాక్టర్ లేడని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, అప్పటికే తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న అమూల్య గర్భంలోని శిశువు మరణించాడు. వెంటనే తేరుకున్న డాక్టర్లు ఆదరాబాదరగా ఆమెకు ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును అప్పగించడంతో ఆగ్రహం తో కుటుంబ సభ్యులు ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పసి పాప మృతి చెందినదని, బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెం గ్రామం ఏలేరు నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది.. స్థానికులు కథనం ప్రకారం పాలెం తామరాడవెళ్మ రహదారి మధ్యలో ఏలేరు నదిపై ఉన్న వంతెన క్రింద ఓ గుర్తు తలియని మృతదేహం నీటిలో తేలుతూ ఉండటంతో అటుగా వెళుతున్న స్థానికుల గమనించి కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న కిర్లంపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.. కానీ మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం మాత్రం చేయలేదు.. ఇదంతా ఎలా ఉంటే ఈ మృతదేహాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏలూరు వంతెనపై చూడడానికి రావడంతో తండోపతండాలుగా జనం తరలి రావడంతో బ్రిడ్జిపై కొంతమేర ట్రాఫిక్ నిలిచిపోయింది.. ఈ మృతదేహం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
చిత్తూరు జిల్లా లోని పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కల దొడ్డి వద్ద ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి, స్థానికుల సహాయంతో గాయపడిన వ్యక్తిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వీరి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని పూసాల గ్రామం లో తీగల నరసయ్య తీగల రాజేశం అనే తండ్రి కొడుకుకులు నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళు పండించిన పంటను విక్రయించేందుకు పూసాలలోని ఐకెపి సెంటర్ కి తీసుకెళ్లారు. అనంతరం పూసాలలోని ఐకెపి సెంటర్లో ధాన్యం విక్రయిస్తుండగా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తీగల నరసయ్య కొడుకు ఆవేశానికి లోనై య్యాడు. క్షణికా వేశంలో విచక్షణ కోల్పోయిన కొడుకు కన్న తండ్రిని పక్కనే ఉన్న బండరాయితో తల పైన బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన తీగల నరసయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా తీగల నరసయ్య మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తరలించి హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.
బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన పత్తిరెడ్డి నాగార్జునరెడ్డి (27) తన పొలానికి నీరు కట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. మృతుడు నాగార్జున వాలంటీర్ గా విధులు నిర్వహిస్తునట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న బేస్తవారిపేట ఎస్సై బి నరసింహారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా దోర్నాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసప్రసాద్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. 9వ తరగతి విద్యార్థినిని ఆయన నివాసంకు తీసుకెళ్లిన ఉపాధ్యాయుడు శ్రీనివాసప్రసాద్. విషయం తెలుసుకున్న విద్యార్థిని సోదరుడు బాజీ ఆయన నివాసం వద్దకు వెళ్లాడు. తన నివాసం వద్దకు ఎందుకు వచ్చావంటు బాజీ పై ఉపాధ్యాయుడు కత్తితో దాడి చేయడంతో బాజీ కి గాయాలు అయ్యాయి. వెంటనే బాజీని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కవలకుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ముగ్గురిని 108 లో ఎర్రగొండపాలెం సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి డిగ్రీ కాలేజ్ ఎదురుగా స్టూడెంట్ పై నుండి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు దూసుకెళ్లడంతో, తీవ్ర గాయాలు పాలైన బెండి.సాయి( 24 ) అనే విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి టెక్కలి వెంకటేశ్వర కాలనీకి చెందిన బెండి ఉమామహేశ్వరి కొడుకు గా గుర్తించారు. మృతుడి తండ్రి తన చిన్నప్పుడే చనిపోవటం తో, తన తల్లి చదివించి, పెద్దచేసి అల్లారు ముద్దుగా పెంచుకుంది. కల్లెదురుగా కన్నకొడుకు చనిపోవటం తో కన్నీరు మున్నీరు గా విలపిస్తుంది.