సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్, ట్రాలీ ఆటోలు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.ఆటోలో ప్రయాణిస్తున్న వారు చేర్యాల మండలం గురన్నపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు జయమ్మ యువతి శిరీషలు కాగా మిగతా వారికి గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలించారు. వీరందరూ మండల పరిధిలోని బీ జీ వెంకటాపూర్ లో పత్తి ఏరేందుకు వచ్చినట్లు సమాచారం.
Crime
సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. ఉపాధ్యాయుడిని ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. తన చావుకు సీఎం జగనే కారణమని ఐదు పేజీల లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. లేఖలో సీఎం జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ, సీపీఎస్ రద్దు చేయాలంటూ, 5 వ తేదీకల్లా జీతాలు ఇవ్వడమే తన చివరి కోరిక అంటూ లేఖలో వెల్లడించారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి గుంటకట్ట సమీపంలోని కనకదుర్గమ్మ గుడిలో హుండీ చోరి గురైంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగ హుండీ తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లాడు. హుండీలో సుమారు 50 వేల రూపాయల నగదు ఉండొచ్చని అంచనా, అయితే ఈ ఆలయంలో చోరీ జరగడం ఇది వరుసగా మూడోసారి. తాజాగా జరిగిన ఈ దొంగతనం దృశ్యాలు గుడి సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లా నక్సల్స్ ఘాతుకం, చోటే డోంగర్ గ్రామస్థుడిని నక్సలైట్లు గొడ్డలితో నరికి చంపారు. మృతుడు కోమల్ మంజ అని పోలీస్‌లు గుర్తించారు. చోటే డోంగర్ గ్రామంలో పేరు పొందిన నాటువైద్యుని మేనల్లుడు మంజ తన మేనమామతో కలిసి ఆలయంలో పూజలు చేసి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగింది. వీరిద్దరికీ గతంలో చంపుతామని బెదిరింపులు కూడా వచ్చాయని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. గత నెల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కొంతమందిని నారాయణ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించి భద్రత కల్పించారని వారిలో వీరిద్దరు కూడా ఉన్నారని అన్నారు. రెండవ దశ పోలింగ్ పూర్తి అయిన తరువాత వీరిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చేశారు. తమకు ఇక రక్షణ అక్కరలేదని తిరస్కరించారని పోలీస్ అధికారి తెలిపారు. మంజ హత్య సంగతి తెలియగానే పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన చోట మావోయిస్టుల చేతిరాత కాగితం దొరికింది. మంజ, అందాయి ఘాటి ఇనుప ఖనిజం గని ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని, భారీగా డబ్బు సంపాదిస్తున్నాడని నోట్లో రాసి ఉంది. మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 18 నెలల అసిర్ అహ్మద్ అనే బాలుడు ఆటో కింద పడి మృతి చెందాడు. ఇంటి వద్దకు వాటర్ క్యాన్ వేయటానికి వచ్చిన ఆటో, ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు అహ్మద్ ను గమనించకుండా ఆటో స్టార్ట్ చేయడంతో ప్రమాదవశాత్తు ఆటో కింద పడి బాలుడు మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు ఆటో కింద పడి మరణించాడని బాలుడి తండ్రి, తాత ఆరోపించారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.
Read Also..
రాష్ట్రీయ రాజ్‌పూత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ దారుణ హత్య కేసులో ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులతో పాటు వారి సహచరుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు లో రోహిత్ రాఠోడ్, నితిన్ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లను చండీగఢ్‌లో అరెస్టు చేశారు. వీరితో పాటు మరో వ్యక్తి ఉద్ధమ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ ఈ నెల 5న పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. రాజస్థాన్ రాజధాని జైపుర్‌లోని శ్యామ్నగర్లో తన నివాసంలో ఉండగా దుండగులు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. నిందితుల గురించి సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితులు తమ ఫోన్లు వినియోగిస్తుండడంతో వారున్న లొకేషన్‌ను గుర్తించారు. అక్కడికి చేరుకుని ఈ కేసులో కీలక నిందితులను అరెస్టు చేశారు.
అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కం దొడ్డి దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరిలో ఒకరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి గుత్తి దగ్గర ధర్మాపురంకు చెందిన వాడని అతని పేరు వినోద్ (26 సంవత్సరాలు)గా గుర్తించారు. వీరు కసాపురం కి వస్తుండగా నక్కం దొడ్డి దగ్గర బైక్ అదుపుతప్పి కిందపడడం తో వినోద్ అక్కడిక్కకడే మృతి చెందాడు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న లారీ. బైక్ ట్యాంకర్ పేలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ ట్యాంకర్ పేలడంతో ఆకస్మాత్తుగ మంటలు చేయాలరేగి బైక్ నడిపే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రత్యేక్షంగా ఉన్న వారు చూస్తుండగానే బైక్ నుండి మంటలు వ్యాపించి క్షణాల్లోనే బూడిద అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీస్ లు ఘటన స్థలనికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు. సజీవ దహనమైనా వ్యక్తి ఎవరు అనే కోణం లో పోలీస్ లు ధర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి పూర్తిగా కాలిపోవడం తో వివరాలు తెలియరాలేదు. పోలీస్ లు ధర్యాప్తు ను కొనసాగిస్తున్నారు.
సింగరాయకొండలో పాతకక్షల నేపథ్యంలో యువకుడును గొంతు కోసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానిక బాలుర ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఆడుతా ఆంధ్ర క్రికెట్ పోటీల్లో క్రీడలను చూడటానికి వచ్చిన మూలుగుంటపాడు గ్రామానికి చెందిన మిరియం శ్రీకాంత్ యువకుడు ను, ఊళ్లపాలెం కు చెందిన కొల్ల సాయి అను యువకుడు మద్యం తాగి కత్తితో మెడకోసిన సంఘటన జరగడంతో ఒక్కసారిగా ప్రాంగణమంతా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన పాత కక్షల నేపథ్యంలోనే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రుని ఒంగోలు రిమ్స్ కు తరలించగా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చింతూరు ఏజెన్సీ లో కలకలం రేపిన జంట హత్య కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు తన భార్య తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శ్రీకాంత్ అనే వ్యక్తిని తన భార్య ప్రియాంకని హత్య చేసిన భర్త నాగేంద్ర. అక్రమ సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీల విషయంలో తగాదాలున్నాయని పథకం ప్రకారం హత్య చేసిన నిందితులు. A1 నాగేంద్ర A2 మినప శ్రీనుకి మృతుడు శ్రీకాంత్ డబ్బులిచ్చి అడగడం విషయంలో గొడవలు.
వివరాల్లోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు శ్రీకాంత్ ,అది నాగేంద్ర, మినప శ్రీను స్నేహితులు అని శ్రీకాంత్ దగ్గర A1, A2 లు కొంత నగదు తీసుకున్నారు. శ్రీకాంత్ A1 గా ఉన్న నాగేంద్ర కు డబ్బులిచ్చి తనతో స్నేహంగా ఉంటు భార్యతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నడని శ్రీకాంత్ కి మినప శ్రీను, నాగేంద్రలకు డబ్బులిచ్చి తిరిగి అడగడం విషయంలో విభేదాలు వచ్చాయి. డబ్బులు విషయంలో వచ్చిన తగాదాలు తన భార్యతో సన్నిహితంగా ఉండే విషయం లో శ్రీకాంత్ పై పగ పెంచుకుని పక్క ప్లాన్ ప్రకారం A2 గా ఉన్న మినప శ్రీను ఇంట్లో నాగేంద్ర భార్యతో శ్రీకాంత్ సన్నిహితంగా ఉన్న విషయం మినప శ్రీను ఫోన్ ద్వారా నాగేంద్రకు చెప్పాడు. నాగేంద్ర భార్య శ్రీకాంత్ లు కలిసి ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళిన నాగేంద్ర విచక్షణ కోల్పోయి కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న ఇనుప రాడ్డు తో బలంగా తలపై కొట్టడంతో శ్రీకాంత్ అక్కడిక్కడే మరణించగా నాగేంద్ర భార్యను కొన ఊపిరితో చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లగా చికిత్స పొందుతూ మరణించిందని మృతుడు శ్రీకాంత్ తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేసి నిందితులను పక్క రాష్ట్రానికి పారిపోతుండగా చట్టి జంక్షన్ వద్ద పట్టుకున్నమని చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్ తెలిపారు.