సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని కస్తూరి బాయి పాఠశాలలో ఓ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసింది. పరీక్షల్లో కాపీ చేయడంతో మార్కులు ఎక్కువగా వచ్చాయని తోటి విద్యార్థుల నడుమ ఉపాధ్యాయులు టార్చర్ చేశారు. దీంతో గదిలోకి వెళ్ళి నవ్య శ్రీ అనే విద్యార్థిని నెయిల్ పాలిష్ తాగింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుల తీరుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు విద్యార్థిని బంధువులు.
Crime
కొడుకు, కోడలు తో పాటు ఆర్టీసి బస్ ఎక్కిన మనువడికి డబ్బులు ఇద్దామని బస్సుకు ఎదురుగా వెళ్ళిన నానమ్మ ప్రమాదవశాత్తు అదే బస్సు కిందపడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం స్టేజ్ వద్ద జరిగింది. గ్రామానికి చెందిన భూక్య లక్ష్మి కుమారుడు, కొడలు, మనువడు హైదరాబాద్ వెళ్దామని ఆర్టీసీ బస్సులో ఎక్కారు. ఇంటి సమీపంలోనే బస్ స్టాప్ ఉంది. అంతకుముందే తనను డబ్బులు అడిగి మారం చేసిన మనువడికి నానమ్మ లక్ష్మి డబ్బులు ఇవ్వడానికి కదులుతున్న బస్సు ఎదురుగా వెళ్ళింది. అది గమనించక డ్రైవర్ బస్సును ముందుకు పోనియ్యడంతో బస్ వెనుక టైర్ల కింద పడి భూక్య లక్ష్మి అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందింది. లక్ష్మి మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నెల రోజుల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇంకా నవ దంపతుల కాళ్లపారాణి ఆరనే లేదు. నవదంపతులు విహారయాత్ర విషాదయాత్రగా మారింది. బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆజంట సముద్రంలో గల్లంతయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన రేలంగి లక్ష్మీనారాయణకు, నాగ గాయత్రి తో గత నవంబరు 1న వివాహం జరిగింది. వరుడు లక్ష్మీనారాయణ భీమవరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో లక్ష్మీనారాయణ తన సతీమణి నాగ గాయత్రితో కలిసి విహార యాత్రకు కోనసీమ జిల్లా అంతర్వేది వచ్చారు. అయితే బీచ్‌లో స్నానానికి దిగగా కెరటాల ఉద్ధృతికి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న ఇరుకుటుంబాల సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి వరకు గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నదంపతుల ఆచూకీ కోసం మత్స్యకారులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also..
Read Also..
తిరుపతి జిల్లా నాగలాపురం దళితవాడకు చెందిన నిషా 23సం”మూడు రోజుల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యాకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూడు రోజుల క్రితం నిషా భర్త శర్మ అక్రమ సంబంధం ఉందని నిలదీస్తూ ఆక్రోసంగా నిషా పై దాడి చేశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. నిషా తల్లిదండ్రులు, బంధువులు మా కూతురుపై ఎందుకు దాడి చేశావు అని అడగగా, వారి పైన కూడా దాడి చేసినట్లు తెలిపారు. మనస్థాపానికి గురైన నిషా ఆత్మహత్యకు పాల్పడి నగిరి, తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. నిషా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి దర్శిత అనే ఒకటిన్నర సంవత్సరాల చిన్న పాప ఉన్నట్లు సమాచారం. సంబంధిత విషయంపై నాగలాపురం ఎస్ఐ ఓబయ్య వివరణ కోరగా పై విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. నిబంధనలకు విరుద్దంగా యాజమాన్యం పరిశ్రమ నడుపుతున్నట్లు గుర్తించారు. కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దాదాపు నాలుగు గంటలు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా వివరాల ప్రకారం అత్యధిక మానవ అక్రమ రవాణా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది.
గతేడాది దేశవ్యాప్తంగా 2250 కేసులు నమోదు కాగా 391 కేసులు తెలంగాణలో వెలుగు చూశాయి. 25 మంది బాలికలు, 9 మంది మంది బంగ్లాదేశ్ యువతులు, 641 మంది మహిళలు, 38 మంది బాలురుతో సహా మొత్తం 704 మందిని రాష్ట్ర పోలీసులు కాపాడారు. బాధితుల్లో కొందరిని రెస్క్యూ హోమ్స్‌కు బాలకార్మికులను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మరికొందరిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు. 600 మందికి పైగా మహిళలు, 100 మంది చిన్నారులకు మెట్రో నగరాలకు అక్రమంగా తరలించినట్టు ఎన్సీబీ నివేదిక చెబుతోంది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో పాటూ ఇతర రాష్ట్రాల యువతులు, మైనర్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తెలంగాణలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందాలు క్రియాశీలకంగా ఉండటంతో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగం, ఉపాధి, ప్రేమ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తెలంగాణకు రప్పిస్తున్నారు. చివరకు వ్యభిచార కూపాల్లో దించుతున్నారు. బీహార్, యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాలకార్మికుల అక్రమ రవాణా సాగుతోంది. రాష్ట్రంలో మానవ అక్రమరవాణాకు చెక్ పెట్టేందుకు 30 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. కేంద్రం గైడ్‌లైన్స్ ప్రకారం సీఐడీ పోలీసులు, స్వచ్చంధ సంస్థలు, చైల్డ్ ప్రొటెక్షన్, లోకల్ పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరుతో ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ లో అర్ధరాత్రి ఘటన ఓ చోటుచేసుకుంది. మృతుడు రౌడీ షీటర్ కిషోర్ గా పోలీసులు గుర్తించారు. హత్యకు కారణం తోటి స్నేహితుల మధ్య జరిగిన వివాదమే.., కత్తితో పొడిచి హతమార్చినట్టు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ సి ఐ మహేశ్వర్ రెడ్డి అలిపిరి సిఐ అబ్బన్న బృందంతో విచారణ ముమ్మరం చేశారు.
Read Also..
పలమనేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న కరెంటు ఫోల్ను కర్ణాటక ఆర్టీసీ బస్సు. ఢీకొని రంగబాబు వరకు ఈడ్చుకొని వెళ్లిన వైనం, ఆ సమయానికి అక్కడ ప్రజలు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది వెంటనే నష్ట నివారణ చేపట్టి కరెంటును పునరుద్ధరించారు, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి చెందాడు. చింతపల్లి ఎస్సై కొట్టడం వలనే చనిపోయాడని వెంటనే ఆ ఎస్సైను సస్పెండ్ చేయాలని బంధువులు దేవరకొండ ఆసుపత్రి ముందు నిరసన చేయడంతో ఆసుపత్రి గేటుకు తాళం వేసి లోపలికి ఎవ్వరినీ రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు… అందుబాటులో లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్న చింతపల్లి ఎస్సై మరియు సీఐ లు. వివరాల్లోకి వెళ్తే… దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామ పంచాయతీ పాలెం తాండలకు చెందిన నేనావత్ సూర్య నాయక్(60) అన్నదమ్ములు భూవివాదంలో ఆదివారం స్థానిక చింతపల్లి పోలీస్ స్టేషన్ లో సూర్య నాయక్ తమ్ముడు నేనావత్ భీమా నాయక్, సూర్య నాయక్ పై పిర్యాదు చేయగా, చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి సూర్య నాయక్ ను స్టేషన్ కు పిలిపించి విచక్షణరహితంగా పోలీస్ స్టేషన్ లో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోవడంతో పోలీస్ సిబ్బంది, అతని కుటుంబ సభ్యులు కలిసి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తున్న మార్గ మధ్యలోనే అతను మృతి చెందడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. అయితే సూర్య బంధువులు దేవరకొండ ఆసుపత్రి నుండి మృత దేహాన్ని తరలించి చింతపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని తెలియజేయడంతో మృతదేహాన్ని తరలించకుండా పోలీసులు అడ్డుకొని ఆసుపత్రి గేటుకు తాళాలు వేసి వారిని బయటకు వెళ్లకుండా నిర్భందించారని కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది…
బాలుడి కిడ్నాప్ కు ప్రయత్నించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన జగిత్యాల పట్టణంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వాణి నగర్ కు చెందిన కొక్కుల గోపి, శైలజల కుమారుడు రాజు (12) నేడు ఇంటి బయట గాలిపటాలు ఎగరేస్తున్నాడు. ఆ సమయంలో ఆలీ అనే వ్యక్తి అక్కడికి వచ్చి రాజుకు మాయ మాటలు చెప్పి కొత్త బస్టాండ్ వరకు తీసుకెళ్లాడు. గమనించిన స్థానికులు ఆలీని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.