Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News చత్తీస్ ఘడ్ నారాయణపుర్ జిల్లాలో నక్సల్స్ ఘాతకం…

చత్తీస్ ఘడ్ నారాయణపుర్ జిల్లాలో నక్సల్స్ ఘాతకం…

by Prakash
Narayanpur district of Chhattisgarh is a hotspot for Naxals

ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లా నక్సల్స్ ఘాతుకం, చోటే డోంగర్ గ్రామస్థుడిని నక్సలైట్లు గొడ్డలితో నరికి చంపారు. మృతుడు కోమల్ మంజ అని పోలీస్‌లు గుర్తించారు. చోటే డోంగర్ గ్రామంలో పేరు పొందిన నాటువైద్యుని మేనల్లుడు మంజ తన మేనమామతో కలిసి ఆలయంలో పూజలు చేసి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగింది. వీరిద్దరికీ గతంలో చంపుతామని బెదిరింపులు కూడా వచ్చాయని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. గత నెల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కొంతమందిని నారాయణ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించి భద్రత కల్పించారని వారిలో వీరిద్దరు కూడా ఉన్నారని అన్నారు. రెండవ దశ పోలింగ్ పూర్తి అయిన తరువాత వీరిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చేశారు. తమకు ఇక రక్షణ అక్కరలేదని తిరస్కరించారని పోలీస్ అధికారి తెలిపారు. మంజ హత్య సంగతి తెలియగానే పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన చోట మావోయిస్టుల చేతిరాత కాగితం దొరికింది. మంజ, అందాయి ఘాటి ఇనుప ఖనిజం గని ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని, భారీగా డబ్బు సంపాదిస్తున్నాడని నోట్‌లో రాసి ఉంది. మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisements

You may also like

Our Visitor

025380
Total views : 147118

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.