సింగరేణి కార్మికుల ప్రాణాలను యాజమాన్యం బలితీసుకుంటుందని ఆరోపిస్తూ కార్మికులు విధులు బహిష్కరించారు.దీంతో యాజమాన్యం బొగ్గు గనికి మొదటి షిప్టు లాకౌట్ ప్రకటించారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లెవన్ ఇంక్లైయిన్ బొగ్గు గనికి చెందిన కార్మికుడు కౌటం సంపత్ ఇంటి నుండి నైట్ షిప్టు డ్యూటికి వెళ్లుతుండగా మార్గమధ్యలో ముందు వెళ్లుతున్నలారీ నుండి బొగ్గు పెల్లలు మీద పడటంతో సంపత్ అక్కడిక్కడే మృతి చెందాడు.నూతన రహదారికి అధికంగా స్పీడ్ బ్రేకర్లు,మూల మలుపు ఉండటం, అధిక దూర భారంతో కార్మికులు తరుచూ రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నారని కార్మికులు ,కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించక పోవటంతో ప్రమాదాలు జరుతున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాత రోడ్డును కార్మికులు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల , పాత రహదారి మూసివేయటం వల్ల ఇప్పటికే 8 మంది కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Crime
శ్రీ సత్య సాయి జిల్లా రోద్దం మండలం లో త్రీవ విషాదం చోటుచేసుకుంది. రెడ్డిపల్లి కట్ట పైన టూ వీలర్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. కూతురికి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ కు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని తండ్రి, కూతురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి పేరు పనిధర్ రెడ్డి కూతురు ఘవిత. పనిందర్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు నరసింహారెడ్డి రోద్దం మండలం రెడ్డిపల్లి గ్రామం.
శ్రీకాకుళం జిల్లా.. గార ఎస్బిఐ డిప్యూటీ మేనేజర్ ఉరిటి స్వప్నప్రియ నిన్న రాత్రి పాయిజన్ తాగి ఆత్మహత్యయత్నంకి పాల్పడ్డారు. విశాఖలోని కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. స్వప్న ప్రియ పనిచేస్తున్న బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మిస్ అయిందంటూ, బంగారాన్ని స్వప్న ప్రియే మిస్ చేసిందంటూ ప్రధాన ఆరోపణలు చేశారు. తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునేందుకు గత పది రోజులుగా బ్యాంకు ను ఖాతాదారులు సంప్రదించడంతో బంగారం ఇవ్వకుండా ఆడిట్ పేరుతో బ్యాంక్ సిబ్బంది వాయిదా వేస్తూ వస్తున్నారు. ఖాతాదారుల ఆందోళనలతో బంగారం మిస్ అయ్యిందన్న ప్రచారంలో వాస్తవం లేదంటూ, డిసెంబర్ 8 నాటికి బ్యాంక్ ఆడిట్ పూర్తి చేసి ఖాతాదారుల బంగారాన్ని ఇచ్చేస్తామని అధికారులు
తెలిపారు. SBI అధికారులు ప్రకటించిన రెండు రోజులకే స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకోవడంతో బంగారం మిస్ అయ్యిందన్న ఆరోపణలకు బలం చేకూరుతుందని బాధిత ఖాతాదారులు వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
అమెరికా లో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఇడాహో రాష్ట్రంలోని పొక్టాటెల్లో లోని ఇంటర్‌స్టేట్ 86 రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. సుమారు 30 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం రోడ్డును క్లియర్ చేసేందుకు సుమారు 7 గంటల సమయం పట్టినట్లు వారు వెల్లడించారు.
అమెరికాలో పలు ఆసుపత్రులు ఒకేసారి సైబర్ దాడి బారినపడటం కలకలం రేపుతోంది. న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహోమా రాష్ట్రాల్లోని 20కి పైగా ఆసుపత్రుల్లో ఆర్డెంట్ హెల్త్ సర్వీసెస్ సంస్థ వైద్య సేవలు, ఇతర సదుపాయాలు అందిస్తోంది. అయితే, సైబర్ నేరగాళ్లు సంస్థకు చెందిన మెడికల్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయడంతో ఆయా ఆసుపత్రుల్లోని వైద్య సేవలు నిలిచిపోయాయి. కాగా, ఘటనపై స్పందించిన ఆర్డెంట్ హెల్త్ సర్వీసెస్ సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ఎమర్జెన్సీ గదుల్లోని రోగులను ముందుజాగ్రత్తగా ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొంది. ఇతర రోగులకు శస్త్రచికిత్సలు వాయిదా వేసినట్టు తెలిపింది. సాధారణ వైద్య సేవలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక సైబర్ దాడిలో ఎలాంటి సమాచారం లీక్ అయ్యిందో ఇప్పుడే చెప్పడం కష్టమని ఆర్డెంట్ సంస్థ వెల్లడించింది.
మార్కాపురం నెహ్రు బజార్ లోని విజయలక్ష్మి క్లినికల్ & బయో కెమికల్ లాబరేటరీ యజమాని తాడి కేశవ ల్యాబ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు తాడి కేశవ జిల్లా ఏరియా ఆసుపత్రి లో కాంటాక్ట్ బేసిక్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వర్తించే వాడు. విధులనుండి తొలగించడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. జగ్గంపేట సీఐ లక్ష్మణరావు, ఎస్సై నాగార్జున రాజుకు వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బందితో గొల్లలగుంట గ్రామంలోని శివారు తుప్పల మాటున 7 డ్రమ్ములలో సారా తయారు చేసేందుకు నిల్వ ఉంచిన సుమారు 1400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. గ్రామాలలో సారా తయారుచేసిన, అమ్మిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు..
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ లో ఈరోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ ను గాయపరిచి గొలుసు లాక్కెళ్ళ టానికి దొంగ ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేయటంతో మహిళ భర్త వెంకట రామిరెడ్డి బయటకు వచ్చి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ లో ఈరోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ ను గాయపరిచి గొలుసు లాక్కెళ్ళ టానికి దొంగ ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేయటంతో మహిళ భర్త వెంకట రామిరెడ్డి బయటకు వచ్చి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దొంగ వెంకట్రామి రెడ్డి నిపొడిచాడు . తీవ్రంగా గాయపడిన వెంకట్రామి రెడ్డిని అనంతపురం సవేరా హాస్పిటల్ కు బంధువులు తరలించారు.
విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పింది. జనతా బజార్ కారుల స్క్రాప్ దుకాణంల్లో మంటలు అంటుకున్నాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటల ను అదుపులోకి ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి అధికారులు పీల్చుకున్నారు. షార్ట్ సార్క్యూట్ తో ప్రమాదం జరిగి ఉంటాదాని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం పుల్లాయ్యిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. కత్తి తో తల్లి వెంకటరత్తమ్మ మేడ పై దాడి చేసాడు. దింతో తీవ్ర రక్తస్రావమైన తల్లి నక్కల రత్తమ్మ(48)అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు శివయ్య ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అస్ది విషయంలో తల్లి కొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో తల్లిని కొడుకు కత్తితో దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.