అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్ ను తుపాకీతో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. పుల్లలపాడు గ్రామంలో తన ఇంటి వద్ద ఉన్న ప్రభాకర్ (60)ను కారులో వచ్చిన దుండగులు అరటిపండ్లు తీసుకోమని పిలిచి తుపాకీతో మూడు రౌండ్లు కాల్చి చంపి దుండగులు పరారయ్యారు కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకొన్న నల్లజర్ల పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు
Crime
అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం 85 నిట్టూరు గ్రామం పొలంలో కంచ విషయంపై నిట్టూరు గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి మేడికుర్తి గ్రామానికి చెందిన ఆదినారాయణ, ఇరువురి ఘర్షణ జరుగుతుండగా మధ్యలో ఆదినారాయణ కొడుకు నాగార్జున రావడంతో నిట్టురుకు చెందిన వెంకటరెడ్డి ఇనుపరాడితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తన చిన్నాయన కంబగిరి అతన్ని విడిపించుటకు వెళ్తే అతనిపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడ్డ 31,59,774 రూ విలువగల అక్రమ మద్యాన్ని, కళ్యాణదుర్గం పట్టణ శివారులో జిల్లా సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కంబదూరు, కుందుర్పి శెట్టురు, బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు రెండు సంవత్సరాల నుండి 159 కేసుల్లో పట్టుబడిన 2779 లీటర్ల మద్యం, 110 లీటర్ల నాటు సారా ను పట్టణ శివారులో ధ్వంసం చేశారు. ఈ అక్రమ మద్యం విలువ 31 లక్షల 51 వేల 774 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
విశాఖలో విజిలెన్స్ ఎస్పీ స్వరూప రాణి ఆధ్వర్యంలో జరిగిన ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. జగదాంబ జంక్షన్ లోని హెలపురి రెస్టారెంట్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన మాంసం అమ్మకానికి పెట్టినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం మధురవాడలోని జీ షాన్ రెస్టారెంట్ పై ఆకస్మిక తనిఖీలు చేశారు. బిర్యానిలో బొద్దింక వచ్చిందని ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేశామని తెలిపారు. ఈ దాడులలో కల్మి కబాబ్, బిర్యానీ శాంపిల్స్ ను సేకరించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్, శానిటేషన్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసిన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో నివాసముంటున్న దంపతులు రవి దేవీలు చిన్నపాటి విషయంపై తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున మద్యం తాగినందుకు డబ్బులు ఇవ్వలేదు అంటూ భార్య దేవి పై భర్త రవి గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిలో భార్య తలకు బలమైన గాయమైంది. స్థానికులు కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. విషయం తెలుసుకున్న గుత్తి సీఐ వెంకటరామిరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని దాడికి ఉపయోగించిన గొడ్డలిని దాడికి పాల్పడిన భర్త రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వి.కోట,నెర్నిపల్లి గ్రామం వద్ద కారు ఢీకొని యువకుడు మృతి, పోలీసుల కథనం మేరకు సోమవారం సాయంత్రం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామానికి చెందిన రాజు కుమారుడు బాలాజీ 28ఏళ్ళు తన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కారు ఢీకొనడంతో మృతి చెందాడని, పోస్టుమార్టం కొరకు పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నెల్లూరు నగరంలోని నేతాజీ నగర్ లో దారుణ సంఘటన. మూడేళ్ల కూతురు హరి మోక్షనా కు విషయం ఇచ్చి చంపిన తల్లి వాణి. దారుణానికి వడికట్టిన తల్లి వాణి, ఉరివేసుకుని ఆత్మహత్య. జరిగిన ఘటనపై స్థానికులుచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకునివిచారణ చేపట్టిన 5వ పట్టణ పోలీసులు.
ఘటనపై స్థానికంగా గోవర్ధన్ అనే వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు. తల్లి వాణి గతంలో కులాంతర వివాహం చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే దారుణ సంఘటన జరిగినట్లు సమాచారం.
డక్కిలి మండలం వెలికల్లు – మార్లగుంట మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం. నారువేత రైతు కూలీలతో వెళ్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీ. ప్యాసింజర్ డ్రైవర్ల మృతి..ఇరు ఆటోలలో ప్రయాణిస్తున్న 20 మంది రైతు కూలీలకు తీవ్ర గాయాలు. గాయపడిన 20 మంది రైతు కూలీలను 108 సహాయంతో రాపూరు,గూడూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపు. గాయపడిన రైతు కూలీలలో 20 మంది రాపూర్ వాసులుగా ప్రాధమిక గుర్తింపు.
విశాఖ జూ పార్క్ లో సోమవారం ఉదయం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు సోమవారం ఉదయం జూ పార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని అతడు క్లీనింగ్లు చేస్తుండగా సంఘటన సంభవించింది. ఎలుగుబంటి బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తీర్చుకున్నాయో, ఎవరు తెరిచి ఉంచారో తెలియాల్సి ఉంది. జూలో ఉన్న సందర్శకులు అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడి పై దాడి చేయడం జరగడంతో సందర్శకులు భయకంపితులయ్యారు. సంఘటనను గుర్తించిన జూ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించారు. తీవ్ర గాయాల పాలైన ఆ ఉద్యోగి నగేష్ ను ఆసుపత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో జూలోని సందర్శకులు అంతా అయోమయానికి గురయ్యారు. జూలో సిబ్బంది కి, సందర్శకులకు భద్రత కరువైందని ప్రజలు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆరిలోవ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మర్కుక్ కాలువకు ఆరుగురు విద్యార్థులు ఈత కోసం వెళ్లగా అందులో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కొండపోచమ్మ పంపు హౌస్ వద్ద కాలువలో పడి గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన విద్యార్థులు మర్కుక్ గ్రామానికి చెందిన చల్ల సంపత్(14), మైసిగారి వినయ్(13) గా స్థానికులు గుర్తించారు. ఒక్కరి మృతదేహం లభ్యమయ్యింది. మరొకరి కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు.
Read Also