Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh తిరుమల పుణ్యక్షేత్రంలో రద్దీ..!

తిరుమల పుణ్యక్షేత్రంలో రద్దీ..!

by Satya
sri venkateshwara swamy

తిరుమల (Thirumala) పుణ్యక్షేత్రంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. అన్ని గంటల పాటు క్యూలైన్లలో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఇక వృద్ధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉన్నప్పటికీ, ఆన్ లైన్ విధానం గురించి అవగాహన లేక వృద్ధులు అవస్థలు పడుతుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. టీటీడీలో ప్రక్షాళనకు చంద్రబాబు సర్కారు నడుం బిగించింది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లకు టీటీడీ నుంచి శుభవార్త వెలువడింది. వేంకటేశ్వరుని ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్‌లకు రెండు టైమ్ స్లాట్లు ఏర్పాటు చేశారు. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

అందుకోసం వృద్ధులు తమ ఫొటో ఐడెండిటీతో వయస్సు రుజువును సమర్పించాలి. సంబంధిత పత్రాలను ఎస్-1 కౌంటర్‌లో సమర్పించాలి. వృద్ధులు ఎక్కువ దూరం నుంచి క్యూలైన్లలో రావాల్సిన అవసరం లేకుండా… వంతెన కింద గ్యాలరీ నుంచి, ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే దైవ దర్శనానికి వెళ్లొచ్చు. అంతేకాదు, వృద్ధుల కోసం మంచి సీటింగ్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యూలైన్లలో వృద్ధులకు వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు అందిస్తారు. క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ స్పష్టం చేసింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి దర్శనం తర్వాత వృద్ధులు 30 నిమిషాల్లోపు ఆలయం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.



  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
    అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్‌ విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
  • వైభవంగా గోదావరి పుష్కరాలు.
    గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: