Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh భద్రాచలం వద్ద తగ్గుతున్న నీటిమట్టం

భద్రాచలం వద్ద తగ్గుతున్న నీటిమట్టం

by Rama
భద్రాచలం వద్ద తగ్గుతున్న నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది.. నిన్న ఉదయం 51.6 అడుగుల వద్ద వరకు చేరిన గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈరోజు ఉదయానికి 47.3 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు సుమారు ఐదు అడుగుల నీటిమట్టం తగ్గింది. గోదావరి నీటిమట్టం తగ్గడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. భద్రాచలం వద్ద తగ్గుతున్న నీటిమట్టం నిలిచి ఉండటం వల్ల భద్రాచలం వద్ద స్నాన ఘట్టాల ప్రాంతం వరదనీటిలోనే మునిగి ఉంది. నీటిమట్టం తగ్గడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల వెళ్లే ప్రధాన రహదారిపై నిన్న చేరిన వరద నీరు తగ్గింది. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు రాకపోకలు సాగుతున్నాయి. ఇంకా నీటిమట్టం తగ్గితే భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే రహదారులు కూడా వరద నీటి నుంచి తేరుకోనున్నాయి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..
    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్‌ రెండ్రోజుల చైనా పర్యటన ముగిసింది. ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ఈ పర్యటన ముగిసింది. ఐతే కీలకాంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక పురోగతి…
  • ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.
    ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య నెలకొన్న సుదీర్ఘ ఘర్షణలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు తమ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో మూడు వారాల పాటు పొడిగించేందుకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా…
  • వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.
    వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది. డెలివరీ కోసం వచ్చే గర్భిణీల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఒక బాలింత విషయంలో వైద్యులు చేసిన నిర్లక్ష్యం ఆమె…
  • జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..
    జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ 7వ వార్డులో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 18 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు…
  • యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి చేరుకున్నారు. మోదీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే, ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా వచ్చి అరుదైన గౌరవాన్ని అందించాయి.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

013893
Total views : 78364

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.