పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ వార్షిక మహోత్సవాలు…. జనవరి 13 న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దేవాలయం బంగారం వెండి మెరుగుల కొరకు మరియు అమ్మవారి విగ్రహానికి రంగుల వేయుట కొరకు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూలవిరాట్ దర్శనం ఈరోజు నుండి ఆపివేసి తిరిగి ఈనెల 28న ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం మూలవిరాట్ దర్శనాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. ఈనెల 27 వరకు అమ్మవారి గర్భాలయం వెనుక ప్రదక్షిణ మండపంలో ఉత్సవ విగ్రహమునకు పూజలు యధావిధిగా జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజి,ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తలు తెలియచేసినారు..
Devotional
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరికి విశ్వ విందు పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ హారతి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నాసిక్, వారణాసి నుంచి విచ్చేసిన పీఠాధిపతులు, స్వామీజీలు మహా మండేశ్వరులు గోదావరిలో పంటు పై పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గోదావరి మాతకు, గట్టుపై కొలువైన అమరేశ్వర స్వామికి అఖండ హారతులు ఇచ్చారు. ముందుగా అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య నదిలో పసుపు, కుంకుమ, పూలు జల్లుతూ అఖండ హారతి ఇచ్చారు. ఈ హారతిని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గోదావరి పవిత్రత విశిష్టతను దేశ ప్రజలకు తెలియజేసేందుకు సుమారు 150 మంది పీఠాధిపతులు, సాధువులు మహా మండేశ్వరుడు నాసిక్ నుంచి ప్రదక్షణ యాత్ర చేపట్టారు. ప్రధాన రేవుల్లో గోదావరికి హారతులు నర్సాపురం విచ్చేశారు. శనివారం భక్తులకు దర్శనమిచ్చి పట్టణంలో పాదయాత్ర చేయనున్నారు.
ఇక్కడ కొలువై వున్న బృహదీస్వర స్వామి, పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు. ఈ ఆలయంలో శిల్ప కళ అద్బుతం. దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు. బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. . దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది ఇది చాల పెద్ద ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది. రాజ రాజ చోళుడు క్రీ.శ. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు. రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి. ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉన్నది.
కార్తీక మాసం శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పున్నమి ఘాట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ దుర్గ భవాని దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైల దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైల దేవస్థానం ఆస్థాన వేద పండితులచే శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు కోటి దీపోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. కోటి దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోటి దీపోత్సవం లో పాల్గొనేందుకు విజయవాడకు చెందిన పలువురు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆర్ జే డి అధినేత, బీహార్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న సాయంకాలం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన తిరుమలకు వచ్చి రాత్రి తిరుమలలోని బస్సు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్, కుటుంబ సభ్యులు.ఈ రోజు ఉదయం లాలూ ప్రసాద్ యాదవ్,ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి, ఆయన తనయుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి దర్శనం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తన కుమారుడి తలనీలాల సమర్పణ కోసం వచ్చామని,తలనీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, మా కుటుంబంతోపాటు దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించాను అని అన్నారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.
కార్తీక మాహోత్సవ వేడుకలను పురస్కరించుకొని కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన కార్తీక కోటి దీపోత్సవ పూజలు. కార్తీక కోటి దీపోత్సవ పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. దేవాలయం ప్రధాన అర్చకులు మామిళ్ళపల్లి సాంబశివరావు గారు మామిళ్ళపల్లి మారుతి శర్మ గారు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అనంతరం స్వామివారిని అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవ పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. శివలింగం, ఓం, స్వస్తిక్, తదితర రూపాలతో అలంకరించిన దీపాలను మహిళా భక్తులు వెలిగిస్తూ దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం గత ఐదేళ్లుగా కోటి దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు…
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీశైలం ఆలయ ప్రాకారం చుట్టూ వున్న శిల్పాలను డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీసి స్థల పురాణ గ్రంధాన్ని నిపుణులతో తయారు చేయిస్తామని అలానే చిత్రలేఖనం తయారు చెపిస్తామన్నారు. అలానే ఈనెల గాని వచ్చేనెల గాని సాలు మండపాలు, క్యూకాంప్లెక్స్ పలు అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదగా శంకుస్థాపన చేయించాలని నిర్ణయించామన్నారు. ఆలయ వెనుక భాగంలో ఉన్న ఏనుగుల చెరువును సుందరీకరణ చేస్తామన్నారు. అలానే రాష్ట్రంలోని గత సంవత్సరం ఆగస్టు నుండి A6 ఆలయాలలో వారోత్సవాలు చేస్తాం. ప్రధాన ఆలయాలలో ఇప్పటికే మహోత్సవాలు చేస్తున్నామన్నారు. హిందూ ధర్మాన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. హిందూ ధర్మం ఒక మతానికి సంబంధించినది కాదని చెప్పరు శ్రీశైలంలోని పంచమటాలను అభివృద్ధి చేసి ఉచితంగా బ్యాటరీ కారులో పంచమటాలను భక్తులు దర్శించేలా ఏర్పాటు చేస్తామని రెడ్డి రాజుల కాలంలో నిర్మించిన పురాతన మెట్లను కూడా పునరుద్ధరణ చేయాలని తీర్మానించామన్నారు. శ్రీశైలంలో మహాకుంభాభిషేకం పీఠాధిపతుల నిర్ణయం ప్రకారం ఉత్తరాయణంలోనే నిర్వహిస్తామన్నారు. చిన్నపిల్లలకు భగవంతుని ముద్రపడేలా కార్టూన్స్ ఏర్పాటు చేయాలని చెప్పాం ఆలయాలలో ఇంజనీరింగ్ క్యాడర్ పెంచడం కోసం చర్యలు తీసుకుని త్వరలోనే క్యాడర్ ని పెంచుతామని మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు తెలిపారు….
పటాన్ చెరువు నియోజకవర్గంలో శ్రీవారి ఆశీస్సుల వల్లనే హ్యాట్రిక్ కొట్టానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండి నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తామని, ప్రజా సమస్యల పైన పోరాడుతామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు.
Read Also..
Read Also..
మహా కుంభమేళాని తలపించేలా గోదావరి ప్రదక్షణ కార్యక్రమం నరసాపురంలో నిర్వహించబోతున్నట్లు నరసాపురం విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు యావత్ భారతదేశం నుండి 300 మంది స్వామీజీలు పీఠాధిపతులు వస్తున్నారని శుక్రవారం సాయంత్రం నరసాపురంలో గోదావరి కి హారతి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా బంధువులు హిందూ సోదర సోదరీమణులు భారీగా తరలిరావాలని వారు కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నరసాపురం ను ఒక పుణ్య ప్రదేశంగా చేసేందుకు గోదావరి ప్రారంభమైన నాసిక్ నుండి గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం అంతర్వేది వరకు పాదయాత్రగా వచ్చిన స్వామీజీలు పీఠాధిపతులు నరసాపురం పట్టణంలో 108 కలశలతో భారీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని అనంతరం గోదావరి కి స్వామీజీలు పిఠాధిపతులు హారతి ఇస్తారన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,344
మంది భక్తులు దర్శించుకుని. మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం. 4.26 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…17,616 మంది, శ్రీవారి సర్వదర్శనానికి 05 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లు లేని భక్తులకు 08 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.