Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Devotional కోటీశ్వరుడు సాయినాథుడు

కోటీశ్వరుడు సాయినాథుడు

by Satya
Sainath

శిర్డీ సాయిబాబా లౌకికపరంగా కూడా మహా కోటీశ్వరుడు! ఆధ్యాత్మికపరంగా సుసంపన్నుడైన సాయినాథుడునికి భక్తులు సమర్పించిన ఆభరణాలు కోట్లాది రూపాయలుగా నిర్థారించారు. ఇహాలోకానికి సంబంధించిన ఈ స్వర్ణాన్ని స్వీకరించి పరలోకానికి చెందిన మహావిలువైన పుణ్యాన్ని మాకందించు సాయీ అంటూ భక్తులు బంగారు, వెండి వస్తువులు ఆయనకు సమర్పిస్తారు. సాయినాథుడు వాటిని తన కనుసన్నలలోనే ఉంచి, ఆయా భక్తులకు సద్గతులు సంప్రాప్తింపజేస్తాడు. నిజానికి బంగారం, వెండి తదితరాలకు విలువ మనం ఆపాదించు కున్నదే… కొంత కాలం వాటి విలువ తగ్గుతుంది… మరికొంత కాలం పెరుగు తుంది… అసలు బంగారం, వెండి తదితరలకే కాదు ఈ సృష్టిలో కనిపించే వాటన్నింటికీ విలువ మనం నిర్థారించుకున్నదే… ఈ బంగారాన్ని అగ్నిలో వేస్తే కాలుతుంది. సాగదీస్తే సాగుతుంది. ఎటు వంచితే అటు వంగుతుంది. శరీర అలంకారానికీ, ఈ లోకానికి చెందిన హాోదాకి తప్ప మరిదేనికి ఉపయోగపడుతుంది? దానిని చివరకు ఈ భూమిమీద వదిలి వేయాల్సిందే తప్ప మన వెంట తీసుకుపోలేము కదా కానీ శాశ్వత విలువ కలిగిందీ, దాని విలువ ఇంత అని నిర్ణయించలేనిదీ శిర్డీ సాయినాథుడుని వద్ద ఉన్నది. దానిని ఆయన మనకందిస్తే దానిని మన వెంట తీసుకుపోగలము! ఆయన ఇచ్చేది ఆత్మకు అంటుకునేది! శరీరానికి కాదు! దానిని అగ్నిలో వేస్తే కాలదు, నీటిలో తడవదు, వంచితే వంగదు. దాని విలువ మనం నిర్థారించలేం. సరే ఇక లౌకిక పరంగా సాయి కోట్ల లెక్కలు చూద్దాం మహారాష్ట్రలోని శిర్డీ సాయిబాబా మందిరానికి రూ. 32 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లు 2009-10 ఆడిట్‌ రిపోర్టులో వెల్లడైంది. వార్షిక ఆదాయం 164.99 కోట్లు లభించగా పెట్టుబడుల మొత్తం రూ. 427.17 కోట్లుగా ఆ నివేదిక పేర్కొంది. రూ. 24.41 కోట్ల బంగారం, రూ. 3.26 కోట్ల వెండి, రూ. 1.12 కోట్ల స్వర్ణ కంఠాభరణాలు ఉన్నట్లు సాయిబాబా సనాతన్‌ ట్రస్టు ఆడిటర్‌ శరద్‌ ఎస్‌. గైక్వాడ్‌ నివేదికలో వివరించారు.

Advertisements

You may also like

Our Visitor

039276
Total views : 195707

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: