కుకీ, మెయ్‌తెయి తెగల మధ్య తీవ్ర ఘర్షణలు, హింసాత్మక పరిస్థితుల తర్వాత ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న మణిపూర్ మరోసారి భగ్గుమంది. అక్కడ మళ్లీ హింస చెలరేగింది. జిబిరామ్ జిల్లాలోని నంగ్‌చప్పీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు కాల్చి చంపారు. నిద్రిస్తున్న అతడిని హత్య చేశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా హింస చెలరేగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలో జిల్లాలో జరిగిన రాకెట్ దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన కార్యక్రమాలు కూడా జరిగాయని పోలీసులు చెప్పారు. కక్చింగ్ జిల్లాలో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. కాల్పులు, బాంబు దాడుల నమోదయాయని పోలీసులు చెప్పారు. బిష్ణుపూర్ జిల్లాలో రాకెట్ దాడులు జరిగాయి. 4.30 గంటలకు జిల్లాలోని ట్రోంగ్లావోబీ వద్ద జరిగిన దాడిలో రెండు నిర్మాణాలు దెబ్బతిన్నాయని, ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. మరో రాకెట్ మొయిరాంగ్ పట్టణంలోని మాజీ ముఖ్యమంత్రి మైరెంబమ్ కోయిరెంగ్ నివాసం ఆవరణలో పడిందని వెల్లడించారు. రాకెట్ దాడుల నేపథ్యంలో యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లు ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. ఇటీవలి దాడుల దృష్ట్యా మణిపూర్ పోలీసులు ఈ ప్రాంతంలో యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లను మోహరించాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి