గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు..
గ్రూప్-1 ఉద్యోగ నియామక(Group-1 Job Recruitment) పరీక్షకు దరఖాస్తుల గడువును TSPSC పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. బుధవారం వరకు 2లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. షెడ్యూల్ మేరకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే దరఖాస్తు గడువును రెండు రోజులు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ(TSPSC) తెలిపింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: గుండ్లపల్లి-పొత్తూరు రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి