గుండె ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి రుజువైంది. నువ్వులనూనె, తవుడునూనె కలిపి వాడితే అధిక రక్తపోటు తగ్గుతున్నట్టు మనదేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అధిక రక్తపోటు బాధితులకు పక్షవాతం, గుండెజబ్బు ముప్పు ఎక్కువన్నది తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా సుమారు 40 గ్రాముల మేరకు నువ్వులనూనె, తవుడునూనె కలిపి తీసుకుంటే.. రక్తపోటు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ తగ్గుదల రక్తపోటు తగ్గటానికి వేసుకునే మందులతో (క్యాల్షియం ఛానెల్ బ్లాకర్స్) సమానంగా ఉండటం గమనార్హం. కేవలం మందులు వేసుకునేవారితో పోలిస్తే.. మందులతో పాటు నూనెల మిశ్రమాన్ని వాడినవారిలో రక్తపోటు రెండు రెట్లు తగ్గటం విశేషం. ఈ నూనెల మిశ్రమంతో చెడ్డ (ఎల్డీఎల్) కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు మంచి (హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ పెరుగుతోందనీ పరిశోధకులు చెబుతున్నారు. నువ్వుల నూనె రక్తపోటుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఇది కూడా క్యాల్షియం ఛానెల్ బ్లాకర్ మందుల్లా ప్రభావం చూపుతుందని గతంలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ దేవరాజన్ శంకర్ పేర్కొంటున్నారు. అయితే దీనికి తవుడు నూనె కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతోంది. నువ్వులనూనెలోని సీసమిన్, సీసమోల్, సీసమోలిన్.. తవుడునూనెలోని ఓరీజనోల్ అనే యాంటీఆక్సిడెంట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రెండు నూనెలూ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (మంచి కొవ్వులు) కలిగున్నాయంటున్నారు.
Health
రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్) ఉన్నవారు వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి. కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని)తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. 2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు. మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది. మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. నీళ్లను వడపోయడం చేయాలి. ప్రతీ రోజూ అర చెంచాడు మెంతి పొడిని భోజనానికి ముందు తీసుకుంటే మధుమేహం వచ్చే సూచనలున్న వారు కొన్నేళ్ల వరకు రాకుండా నివారించొచ్చు.
Read Also..
Read Also..
పెదవులు నల్లగా ఉన్నాయని ఆందోళన పడుతున్నారా… అయితే మీరేం చేయాలంటే.. వెన్న, ఆరెంజ్ రసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేస్తూ వచ్చారంటే లిప్‌స్టిక్ వెయ్యకుంటానా మీ పెదవులు అందంగా, మృదువుగా మారిపోతాయి. పసిపిల్లలకు స్నానం చేయించటానికి ముందు వెన్నను ఒంటికి పట్టించి, నలుగు పెట్టి స్నానం చేయిస్తే పాపాయి చర్మం కాంతిగా, మృదువుగా ఉంటుంది. వంటిపై సన్నని నూగులాంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయి. వెన్నను ముఖానికి పట్టించి మెత్తటి సున్నిపిండిలో పసుపు కలిపి ముఖం రుద్దుకుంటే చర్మపు వర్చస్సు పెరుగుతుంది. నలుపు ఛాయలో ఉన్నవారు వెన్నలో తేనెను కలిపి పేస్టులా తయారుచేసి, నిత్యం ముఖానికి పట్టిస్తే నలుపు తగ్గి, ముఖ చర్మం ప్రకాశవంతమవుతుంది. వెన్నలో గులాబి రెక్కల పేస్టును కలిపి పెదాలకు రాస్తే పెదాలు గులాబీ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వెన్న, కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి కళ్లక్రింద ఏర్పడిన నల్లని చారలకు, ముడతలకు రాస్తూంటే మచ్చలు తొలగిపోతాయి. వెన్నలో పసుపు కలిపి మడమలకు, పాదాల పగుళ్లకు రాస్తే దురదమంట తగి, చర్మం మెత్తపడి పగుళ్ళు తగ్గిపోతాయి. ప్రతిరోజూ వెన్నలో నల్ల నువ్వులు కలిపి, చిన్న మాత్రలా చేసి తింటే వెంట్రుకలు నెరవకుండా నల్లగా ఉంటాయి. ప్రతిరోజూ ఆహారంలో మొదటి ముద్దలో వెన్న కలిపి తింటే వృద్ధాప్య లక్షణాలు త్వరగా ఏర్పడవు. వెన్నలో పసుపు, సున్నం కలిపి కట్టుకడితే గోరుచుట్టు తగ్గుతుంది. కాలిన బొబ్బల మీద ఆరారగా వెన్న రాస్తే మంట ఉపశమనం. వెన్నను కనురెప్పలమీద రాస్తే, వెంట్రుకలు రాలిపోకుండా దృఢంగా, అందంగా ఉంటాయి. బొప్పాయి గుజ్జులో వెన్నను కలిపి ముఖ చర్మంమీద సున్నితంగా మసాజ్ చేస్తే ముఖ చర్మం మృదువుగా మారి, తేమతో కాంతిగా, అందంగా కనిపిస్తుంది.
గింజపప్పులను (నట్స్) తరచుగా తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, అక్రోటు (వాల్నట్), వేరుశనగపప్పుల్లోని అసంతృప్తకొవ్వులు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. చేపలతో లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా వీటిల్లో ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. గింజపప్పులు ఎంత ఆరోగ్యకరమైనవైనా మితంగానే తినాలి. రోజుకి ఆరేడు కన్నా (వారానికి 30 గ్రాములు) మించకుండా చూసుకోవాలి. అప్పుడే వీటితో కలిగే ప్రయోజనాలు అందుతాయి.
Read Also..
Read Also..
నగరంలో దొరికే కివీ పండల్తో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుంటాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెంట్లు పూర్తి పీచు పదార్ధంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియిన్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో కంటిసంబంధిత , వయసు పెరుగుదలతో వచ్చే మాక్యులార్ క్షీణత 36% వరకూ తగ్గుతుందని శరీరం లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు. మరో అధ్యయనములో కివి పండు నుంచి తీసిన రసము చర్మ క్యాన్సర్ ను నిరోధిస్తుందని తేలింది.
Read Also..
దీనితో తయారుచేయబడిన అంతవర్ధ ప్రసమన, ఉబ్బసం వ్యాధితో బాధపడేవారికి దివౌషధంగా పని చేస్తుంది. సిరోవిరికన అనే ఔషధం, నాసికా చికిత్సకి అనాదిగా వాడుతున్నట్టు వైద్య సంహితల్లో పేర్కొన్నారు. యాలకులు బాగా నూరి నుదురుకి లేపనం చేస్తే తల నొప్పి చిటి కెలో మటుమాయమవుతుంది. అలాగే యాలకుల కషా యం సేవిస్తే దగ్గు నుంచి మంచి ఉపశమనం ఉం టుంది. యాలకుల గింజలు నోటితో నములుతుండటం వల్ల క్రిములు నశించడమే కాకుండా నోటి దుర్వాసనను అరికడుతుంది. దంతాలను, చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. యాలకులు నూరి పేస్ట్‌గా చేసి గాయా లకి, పుండ్లకి పైలేపనంగా వాడితే వెంటనే మానిపో తాయి. వీటిని నములుతూ ఉండటం వల్ల ఉదర సంబంధ వ్యాధులు ఉపశమించడమే కాక కడుపులో ఏర్పడ్డ పుండ్లు (అల్సర్స్) కూడా తగ్గుముఖం పడ తాయి. చాలా రకాల రుగ్మత లకి ఇలద్వయ (ఇలాచీ-యాలకులు) ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. యాలకుల తైలం పంటినొ ప్పిని నివారించి, క్రిముల్ని సమూలంగా నాశనం చేస్తుంది. దీని కషాయం సేవిస్తే వాంతులు అరికట్టి, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. ఆస్త్మా రోగులు యాలకులు, జాతిఫల, కుంకుమ పువ్వు, వంశలోకన, నాగకేసర, శంఖజీరక సమ పాళ్ళలో నూరి తేనెతో కలిపి సేవిస్తూవుంటే ఆ వ్యాధి నుంచి మంచి ఉపశమనం ఏర్పడుతుంది.
భోజనానంతరం సోంపు గింజలు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అవిదుర్వాసనలను దూరం చేయడమే కాదు.. చాలాసేపటికి వరకూ నోటిని తాజాగా ఉంచుతాయి. ఆరోగ్యానికీ సోంపు గింజలు చాలా మంచివి. వీటి నుంచి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. భోజనం తరవాతే కాదు.. ముందూ తీసుకోవచ్చు. సోంపులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొవ్వు పెంచే కార్బోహైడ్రేట్లను ఇవి దూరం చేస్తాయి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తాయి. వీటిలో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియల రేటు సక్రమంగా ఉండేలా చూస్తుంది. పీచు వల్ల గుండెకు కూడా మేలే. ఎలాగంటే… పీచు పదార్థాలతో రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. సోంపును తరచూ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది. అలానే చెడు కొవ్వును సోంపులోని పోషకాలు గ్రహిస్తాయి. వీటిల్లోని కాపర్ ఎర్రరక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. జింక్ శారీరక ఎదుగుదలకూ, అవయవాలు దృఢంగా ఉండటానికీ తోడ్పడుతుంది. రక్తపోటుతో బాధపడే వారు సోంపు గింజల్ని రోజులో ఒకటి రెండుసార్లు నమిలితే మంచిది. అలా చేయడం వల్ల పొటాషియం శరీరానికి అంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తుంది. కప్పు సోంపులో ఇరవై శాతం పైనే విటమిన్ ‘సి’ ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచడానికీ, చర్మ కణజాలం దృఢపడి గాయాలైనప్పుడు త్వరగా మానిపోవడానికి దోహదం చేస్తుంది. సోంపు గింజల్లోని ఫ్లవనాయిడ్లు ఒత్తిడిని దూరం చేస్తాయి.
క్యారెట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. కాబట్టి మెరిసేటటువంటి చర్మ సౌందర్యం పొందాలనుకుంటే ప్రతి రోజూ క్యారెట్ తినడం కానీ, లేదా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ చేయాలి.
Read Also..
Read Also..
చైనాలో ఎప్పట్నుంచో వినియోగిస్తున్న ఈ నల్ల బియ్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు “సూపర్ ఫుడ్”గా అభివర్ణిస్తున్నారు. వీటిలో చక్కెర తక్కువగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయని లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయం చేసిన అధ్యాయనంలో వెల్లడైంది. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లతో పోరాడటంలో దోహదం చేస్తాయని పరిశోధక్లు చెబుతున్నారు. “చెంచాడు నల్లబియ్యం తవుడులో బ్లాక్బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్ ఆక్సిడెంట్లు ఉంటాయి. చక్కెర మోతాదు తక్కువగానూ పీచు, “విటమిన్ ఈ” ఎక్కువగానూ ఉన్నాయని అధ్యయానానికి నేతృత్వం వహించిన డాక్టర్ జిమిన్ జు పేర్కొన్నారు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవటాన్ని ప్రోత్సాహించటానికి నల్లబియ్యం తవుడు ప్రత్యేకమైన, చవకైన మార్గమని ఆయన సూచించారు.బ్లూబెర్రీలు, ఎండు మిరప వంటి పండ్లు, కూరగాయలకు ఈ యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అయిన ఇవి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు వివరించారు. పూర్వకాలంలో ఈ నల్లబియ్యాన్ని “నిషిద్ద బియ్యం” అని పిలుచుకునేవారు.
Read Also..
Read Also..
ఈ కాలంలో విరివిగా దొరికే నల్ల ద్రాక్ష రకరకాల ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుతుంది. ఏ వయసు వారయినా రోజూ కొన్ని ద్రాక్షలు తింటే ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. నల్లద్రాక్షలో తక్కువ గ్త్లెసమిక్ ఇండెక్స్ ఉంటుంది. అది రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంటుంది. మధుమేహంతో బాధపడే వారికి ఈ ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. ఇవి గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయని మిషిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు చెబుతున్నారు. వీటిల్లోని ఫైటోకెమికల్స్ గుండె కవాటాలు పాడవకుండా కాపాడతాయి. రక్తపోటుతో ఇబ్బంది పడేవారు రోజూ గుప్పెడు నల్ల ద్రాక్ష తినడం మంచిది. దీంతో కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. చదువుకునే విద్యార్థులు వీటిని తరచూ తింటే మెదడు చురుగ్గా మారుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకు ఎంత తినిపిస్తే అంత మంచిది. మతిమరుపు సమస్య అంత తేలిగ్గా దరిచేరదు. యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇవి గాయాలైనప్పుడు త్వరగా రక్తం గడ్డకట్టడానికి తోడ్పడతాయి. నల్లద్రాక్షలో ఫాలిఫినాల్ శాతం ఎక్కువ. ఇది శరీరంలో క్యాన్సర్ కారకాలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పోరాడుతుంటుంది. ఎండిపోయిన నల్ల ద్రాక్షను తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. అవి ఆస్టియోపోరోసిస్‌కు దూరంగా ఉంచుతాయి. ప్రతిరోజూ పాలల్లో వేసుకొని తింటే స్పష్టమైన కంటి చూపు మెరుగవుతుంది.
Read Also..





Total views : 91153