వ్యాధినిరోధక శక్తి ని పెంచుతుంది. శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది. కణజాలము పొరను రక్షిస్తుంది , కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , జామ ఏడాది పొడవునా అడపాదడపా లబిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది . ప్రపంచం లొ అన్ని దేశాలలో ను లభిస్తుంది. ఆసియా దేశాలలొ విసృఉతం గా పండుతుంది. కమలా పండు లో కంటే ఇదు రెట్లు అధికం గా విటమిను ” సి ” ఉంటుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయ లో ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచేందుకు అవసరమయ్యే ” కొల్లాజన్ ” ఉత్పత్తికి ఇది కీలకము , కొవ్వు మెటబాలిజం ను ప్రభావితం జేసే ” పెక్టిన్” జామ లొ లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి , పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడం లో సహకరిస్తుంది. జామ లొ కొవ్వు , క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు.
Health
కాఫీలు, టీలు కడుపు నింపుతాయా, ఆరోగ్యాన్నిస్తాయా అని చాలా మంది సణుగుతూ ఉంటారు. దానికి కారణం దాని వల్ల ఆరోగ్యానికి ఏదైనా హాని జరుగుతుందేమోనన్న భయంతో. కానీ ఇప్పుడు భోజనాన్ని తగ్గించి మరీ రోజుకోసారైనా కాఫీ తాగండీ, ఆరోగ్యాన్ని కాపాడుకోండని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు చూస్తే కొంతమంది జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని బాధపడుతుంటారు. అయితే ఇక నుంచి కాఫీ తాగండి. నడుం కొలత పెరిగిపోతోందని దిగులు పడుతున్న వారు కూడా కాఫీ తాగితే వారి బాధ తగ్గిపోతుంది. ఈ వాస్తవాలన్నీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయ్యాయి. రాత్రి పూట భోజనం మితంగా తీసుకుని ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు నడుం కూడా సన్న బడుతుందట. మెదడు చురుగ్గా పనిచేయాలంటే అప్పుడప్పుడు కడుపును మాడ్చుకుంటే మంచిదని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఇలా ఉపవాసం ఉండటం వల్ల ఒంట్లోని క్యాలరీలు ఖర్చయి ఆరోగ్యవంతంగా ఉండడంతోపాటు ఆయుర్దాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. క్యాలరీలు బాగా ఖర్చయితే జ్ఞాపకశక్తికి, పరిజ్ఞాన శక్తికి అవసరమైన మెదడులోని సీఆర్ఈబీఐ అనే ప్రోటీన్ బాగా ఉత్పత్తి అవుతుందని వైద్య పరిశోధనలో తేలింది. ఇలా చేయడం వల్ల రోజుకు సుమారు 600 క్యాలరీలు ఖర్చవుతాయట. అందువల్ల కాఫీలు తాగితే ఆరోగ్యం చెడిపోతుందన్న అపోహలు వదిలేసి మితాహారం, కప్పు కాఫీతో మీ రాత్రి మెనూ సి
నేరేడులోని ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. గింజల్లో జంబోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధి నివారణకు దోహదపడుతుంది. గింజలను ఎండబెట్టి పొడిచేసి రోజుకు రెండు సార్లు ఒక స్పూన్ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిపై చక్కని ప్రభావం చూపుతుంది. ఈ చెట్టు బెరడును నలగ్గొట్టి వేడి నీళ్ళలో నానబెట్టి కషాయం చేసుకొని దానిలో తేనే కలుపుకొని తాగితే రక్త స్రావం తగ్గిపోతుంది. చెవుల్లో నుంచి చీము కారడం వల్ల బాధ పడే వారికి ఇది చాలా మంచి మందు. ఆకులూ, పండ్లను దంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి రెండు చెవుల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. తొందరగా ఉపశమనం కలుగుతుంది. వైట్ డిశ్చార్జ్ తో బాధ పడేవారు ఈ చెట్టు వేర్లను దంచి ముద్ద చేసి బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి తీసుకుంటే రక్త హీనత, వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది. అతి మూత్ర వ్యాధితో బాధ పడేవారు ఈ పండు గింజలను పొడి చేసి ఉదయం ఖాళీ కడుపుతో చన్నీళ్ళతో తాగితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు ఈ నేరేడు పండ్లను తినడం మంచిది. ఎందుకంటే ఈ పండులో సహజమైన యాసిడ్ లు ఉన్నాయి. అవి కాలేయాన్ని శక్తివంతం చేసి దాని పని తీరును మెరుగుపరుస్తాయి. అర్షమొలలు (ఫైల్స్) తో బాధ పడే వారికి నేరేడు బాగా పని చేస్తుంది. ఈ పండ్లను అవి దొరికే కాలంలో ప్రతి రోజు ఉదయం ఉప్పుతో కలిపి తింటే మంచి ఫలితం కలినిపిస్తుంది. అంతే కాదండోయ్ ఇన్ని మంచి గుణాలు కలిగిన ఈ పండ్లను ఎక్కువగా తింటే గొంతు పట్టేసే అవకాశం కూడా ఉంది.
Read Also..
Read Also..
కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి. వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు కుదుళ్లు పూడుకుపోతాయి. దీనివల్ల వెంట్రుకలకి కావాల్సిన పోషణ అందదు. అలాంటప్పుడు కరివేపాకుని మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని మాడుకి అంటేలా రాసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే, జట్టు రాలిపోవడం సమస్య తగ్గుతుంది. చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇలాంటి వారు కూరల్లో వేసిన కరివేపాకుని తినడమే కాదు… దాని మిశ్రమాన్ని తలకి పట్టించుకుని, కాసేపయ్యాక శుభ్రపరుచుకున్నా మంచిదే. కొన్ని వారాల్లోనే జుట్టు నల్లగా మారడం గమనిస్తారు. జుట్టు బాగా పెరగాలనుకునేవారు కరివేపాకుని నీళ్లల్లో వేసి మరిగించాలి. ఆ నీటిని మాడుకీ, వెంట్రుకలకీ తగిలేలా మర్దన చేసుకోవాలి. పావుగంట తరవాత మామూలు నీళ్లతో స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. కరివేపాకు పేస్టుకి కొంచెం పెరుగు కలిపి దాన్ని హెయిర్ మాస్క్‌లా తలకు పెట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
మసాలా దినుసుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దాల్చిన చెక్క గురించి. ఇది వంటకాలకు రుచినీ, సువాసననూ అందిస్తుంది. గుండెకు ముప్పు వాటిల్లకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అరోమా గుణాలున్న దాల్చిన చెక్కలో పీచూ, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. హాని చేసే కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీనిలో యాంటీఫంగల్ గుణాలు అధికం. ఇది శరీరంలో హాని చేసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. రక్తహీనతతో బాధపడే వారు ప్రతిరోజూ ఆహారంలో దాల్చిన చెక్క ఉండేలా చూసుకోవాలి ఇది చర్మానికి మేలు చేస్తుంది. ప్రతిరోజూ గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో చెంచా దాల్చిన చెక్కపొడీ, కొద్దిగా తేనె కలిపి తాగితే ఎంతో మంచిది.
Read Also..
Read Also..
తాజా పువ్వు రసాన్ని ప్రతిరోజూ ఒక కప్పు చొప్పున రెండుమూడు మాసాలపాటు సేవిస్తుంటే పొట్టలో కురుపులు, దంతాల చిగుళ్లనుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి. కాలిఫ్లవర్ ఆకుల రసం రోజూ ఒక కప్పు స్వీకరిస్తుంటే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి. గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ కాలిఫ్లవర్ పువ్వు ఆకుల రసం సేవిస్తుంటే పిండం ఆరోగ్యంగా ఉండి, వెంటవెంటనే గర్భధారణ కాకుండా ఉంటుంది. కాలిఫ్లవర్ క్యాన్సర్‌నని దూరంగా ఉంచును . కాలిఫ్లవర్‌లో ఉండే రసాయనాలు క్యాన్సర్ బారినుండి దూరంగా ఉంచడమే కాకుండా మన కాలేయం పనితీరును కూడా క్రమబద్ధం చేస్తుంది. కాలిఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్, ఇంకా బ్లాడర్ క్యాన్సర్ వంటి పలు క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్, ధయోసయనేట్స్ లివర్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్ధరైటిస్ నుండి రక్షణనిస్తుందని పరిశోధనలు తేల్చాయి. స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B కాలిఫ్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్ లో కావలసిన శక్తి లభిస్తుంది. కాలిఫ్లవర్ లో విటమిన్ C – కాల్షియమ్ కూడా లభిస్తాయి. ఇందులో ఫ్యాట్ కంటెంట్ 0. కాలిఫ్లవర్ ను ప్రతి రోజూ స్త్రీలు కనీసం 400 మైక్రోగ్రామ్స్ అయినా తీస్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కిస్మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్మిస్ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రిపూట రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతా యి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తం లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్ర్తీల కు ఇది ఎంతో ఉపయోగం.
ఆపిల్ పోషకాల గురించి మనకు తెలిసిందే. అయితే అందులోని ఔషధగుణాలవల్ల చాలా రకాల వ్యాధుల్ని నివారించవచ్చంటున్నాయి ఈ సరికొత్త పరిశోధనలు. రోజూ కనీసం ఓ ఆపిల్ తినేవాళ్లలో (తినని వాళ్లతో పోలిస్తే) మధుమేహం కూడా తక్కువే. ఆపిల్‌ని కొందరు తొక్క తీసి తింటారు. కానీ అందులోని ట్రిటర్పినాయిడ్లు కాలేయ, పేగు, రొమ్ము క్యాన్సర్ల కణాలు పెరగకుండా అడ్డుపడతాయి. ఆపిల్ జ్యూస్‌కి ఆల్జీమర్స్ని నిరోధించే శక్తి ఉంది. మెదడులోని ఎసిటైల్ కోలీన్ స్రావాన్ని పెంచడం ద్వారా న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరుని మెరుగుపరుస్తుంది.
జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. పీచూ, విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి. గర్భిణులకు ఈ కాకరకాయ చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫొలేట్లు శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతుంది. గర్భిణులు రెండు పూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వల్ల దాదాపు వందగ్రాముల ఫొలేట్ అందుతుంది. మధుమేహంతోబాధపడే వారికి ఆ కాకరకాయ మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయుల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి. తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఆకాకరకాయలోని విటమిన్ ‘సి’ శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్ కారకాలుగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే విటమిన్ ‘ఎ’ కంటి చూపునకు మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.
Read also..
Read also..
ఉసిరి.. విటమిన్ ‘సి’ నిండుగా అందించే పోషకంగా మనందరికీ తెలుసు. ఆహారంగానే కాదు చర్మం, జుట్టు అందానికీ ఇదెంతో ఉపయోగపడుతుంది. ఇలా ప్రయత్నించండి.. ముఖంపై ముడతలతో చాలామంది తమ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తారు. ఇలాంటివాళ్లు టేబుల్ స్పూన్ ఉసిరి పొడిలో చెంచా పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. కనీసం రెండు మూడురోజులకోసారి చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. రోజంతా ఎండ, దుమ్ము ధూళి కారణంగా చర్మంపై నలుపుదనం పెరుగుతుంది. గరుకుగా తయారవుతుంది. ఉసిరి రసం ముఖానికి రాసి పదినిమిషాలాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రంచేసుకోవాలి. మీది మరీ సున్నిత చర్మతత్వం అయితే కొంచెం తేనె కలిపి రాసుకున్నా సరిపోతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ గ్రంథుల్ని శుభ్రపరుస్తాయి. మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు ఉసిరిపొడిలో చెంచా పెసరపిండి, చెంచా నిమ్మరసం, కాసిని పాలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకోసారి చేస్తుంటే మొటిమల సమస్య దూరమవుతుంది. కాలుష్యం, కఠిన రసాయనాల వాడకం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్ల వృద్ధికి తోడ్పడతాయి. మాడు పొడిబారడం, చుండ్రు సమస్యలున్నాయా? ఉసిరిపొడి మజ్జిగలో నానబెట్టి దానికి కోడి గుడ్డు తెల్లసొన, చెంచా బాదం నూనె జత చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంటాగి మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే సరి.





Total views : 91083