Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Health అందాలకు… సిరి

అందాలకు… సిరి

by Rama
Amla

ఉసిరి.. విటమిన్‌ ‘సి’ నిండుగా అందించే పోషకంగా మనందరికీ తెలుసు. ఆహారంగానే కాదు చర్మం, జుట్టు అందానికీ ఇదెంతో ఉపయోగపడుతుంది. ఇలా ప్రయత్నించండి.. ముఖంపై ముడతలతో చాలామంది తమ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తారు. ఇలాంటివాళ్లు టేబుల్‌ స్పూన్‌ ఉసిరి పొడిలో చెంచా పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. కనీసం రెండు మూడురోజులకోసారి చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. రోజంతా ఎండ, దుమ్ము ధూళి కారణంగా చర్మంపై నలుపుదనం పెరుగుతుంది. గరుకుగా తయారవుతుంది. ఉసిరి రసం ముఖానికి రాసి పదినిమిషాలాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రంచేసుకోవాలి. మీది మరీ సున్నిత చర్మతత్వం అయితే కొంచెం తేనె కలిపి రాసుకున్నా సరిపోతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ గ్రంథుల్ని శుభ్రపరుస్తాయి. మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు ఉసిరిపొడిలో చెంచా పెసరపిండి, చెంచా నిమ్మరసం, కాసిని పాలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకోసారి చేస్తుంటే మొటిమల సమస్య దూరమవుతుంది. కాలుష్యం, కఠిన రసాయనాల వాడకం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఉసిరిలో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్ల వృద్ధికి తోడ్పడతాయి. మాడు పొడిబారడం, చుండ్రు సమస్యలున్నాయా? ఉసిరిపొడి మజ్జిగలో నానబెట్టి దానికి కోడి గుడ్డు తెల్లసొన, చెంచా బాదం నూనె జత చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంటాగి మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే సరి.

Advertisements

You may also like

Our Visitor

040963
Total views : 212536

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: