రోజుకో యాపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదన్న నానుడి తప్పుంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. అలా తింటే తప్పనిసరిగా దంతవైద్యుడిని ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. తరచూ యాపిల్ తినేవారి పళ్లకు.. కర్బన పానీయాలు(కార్బొనేటడ్ డ్రింక్స్) తాగే వారి దంతాలకంటే నాలుగురెట్లు ముప్పెక్కువని లండన్‌లోని కింగ్స్ కళాశాల దంతవైద్యశాల శాస్త్రవేత్తలు తెలిపారు. ద్రాక్ష సారాయి(వైన్), బీర్లతోనూ దంతక్షయం తప్పదని హెచ్చరించారు. ”మనం ఏం తిన్నామన్నదానికంటే ఎలా తిన్నామనేదే ముఖ్యం. యాపిల్స్ తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. కానీ, వాటిని తరచూ తినడంతో ఆమ్లాల స్థాయి పెరిగి దంతాలు పాడవుతాయి” అని ముఖ్య అధ్యయనకర్త డేవిడ్ బాట్లెట్ తెలిపారు. తీసుకునే ఆహారానికి, దంతాల ఆరోగ్యానికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సుగల వెయ్యిమందిపై పరిశోధనలు నిర్వహించి ఈ ఫలితాలు కనుగొన్నట్లు చెప్పారు. అయితే, కొన్ని రకాల పండ్లు ఆమ్లత్వాన్ని కలిగిఉన్నా.. వాటిని తినే విషయంలో నిరుత్సాహానికి గురిచేయొద్దని మెడికల్ రీసెర్చి కౌన్సిల్‌కు చెందిన డా.గ్లెనిస్ జోన్స్ తెలిపారు. యాపిల్‌తోపాటు పాలు, జున్ను తీసుకోవడం, ఆ తర్వాత బాగా నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని సూచించారు.
Health
మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం. బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు. ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది. రక్త శుద్దికి తోడ్పడుతుంది. రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది. అల్లం కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు. అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి , దంటాలను ఆరొగ్యము గా ఉంచుతుంచి.
Read also..
Read also..
వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు’ అంటున్నారు పోషకాహార నిపుణులు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడాలని డైటింగ్ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. అంటే ముప్ఫై గ్రాముల చికెన్, మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట. వీటిని కూరల్లోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు. బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. ఉడికించిన తరవాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి. కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది.
Read Also..
Read Also..
చాలామంది రాత్రివేళ నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ కు అలవాటు పడిన వారు కూడా ఉన్నారు. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఒక చక్కని విధానాన్ని అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి టెన్షన్ ను వదిలేసి ఐదునిమిషాల్లో నిద్రపోయే ఆ విధానం ఏంటి?మరి ఆ ట్రిక్ ఏమిటి అంటే. నిద్రపోవడానికి బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ముందు మీ శరీరాన్ని కామ్ డౌన్ చేసి, శరీరానికి విశ్రాంతినివ్వాలి. మనసులో నుండి ఆలోచనలను తీసివెయ్యాలి. ఆ తర్వాత నిదానంగా కళ్ళు మూసుకుని శరీరంలోని అన్ని భాగాలను రిలాక్స్ చేయాలి. నుదుటి కండరాలను రిలాక్స్ చేయాలి. ఆ తర్వాత శ్వాస మీద దృష్టి పెట్టి భుజాలను కూడా రిలాక్సింగ్ మోడ్ లో ఉంచి ఉచ్వాస నిశ్వాసలపై దృష్టి పెట్టాలి. లోతుగా శ్వాస తీసుకుంటూ, మళ్లీ శ్వాస వదులుతూ శ్రద్ధ మొత్తం బ్రీతింగ్ పైనే పెట్టాలి. అప్పుడు కచ్చితంగా ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారని నిపుణులు చెబుతున్నారు.
Read Also..
Read Also..
పెరుగుతో ఉప్పు కలిపి తినకూడదని, కలిపితే లాక్టోబాసిల్లస్ బాక్టీరియా మరణిస్తుంది. దీనివల్ల పెరుగు తీసుకొని కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటూ ఎంతోమంది చెబుతుంటారు. కానీ ఇందులో అసలు వాస్తవమే లేదు.అందుకే పుకార్లను పట్టించుకోకుండా ఉప్పు లేదా పంచదార కలిపిన పెరుగుని చక్కగా తినొచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.అయితే పెరుగుతో పాటు కలిపి తినకూడని పదార్థాలు కొన్నివున్నాయి. నెయ్యిని పెరుగుతో కలిపి తీసుకుంటే ఆహారం జీర్ణమవదు.రాత్రి వేళ మన శరీరంలో కఫం ప్రాబల్యం ఉంటుంది. దీనివల్ల ముక్కు భాగాల్లో శ్లేష్మం ఏర్పడుతుంది. దగ్గు, ఆస్తమా, జలుబు చేసేవారు రాత్రి సమయంలో పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.
ఒక వ్యక్తి చాలా ఒత్తిడికి గురైనప్పుడు, వారి రక్తంలో ఒత్తిడి హార్మోన్లు కార్టిసాల్ పెరుగుతుంది. ఫలితంగా, హృదయ స్పందన రేటు మరియు శ్వాస ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఒత్తిడి హార్మోన్లు నిరంతరం రక్తంలో ఉంటే, అది తీవ్ర అలసటను కలిగిస్తుంది. దంతాలు కొరకడం కూడా ఒత్తిడికి సంకేతం. ఇది నిద్రలేమికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.ఒత్తిడి యొక్క లక్షణాలలో తలనొప్పి ఒకటి. తరచుగా ఈ రకమైన తలనొప్పి చాలా టెన్షన్ వల్ల వస్తుంది.ఒత్తిడి ఒకరి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది మరియు ఒకరి మనస్సును నియంత్రించడం కష్టతరం చేస్తుంది.ఒకరి సెక్స్ డ్రైవ్ బాగా పనిచేయాలంటే, శరీరం హార్మోన్ల సమతుల్యతను కలిగి ఉండాలి మరియు నరాలు క్రమంలో ఉండాలి. కానీ ఒత్తిడితో, ఎక్కువ ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి, ఇది సెక్స్ డ్రైవ్‌కు ఆటంకం కలిగిస్తుంది మరియు సెక్స్ డ్రైవ్‌ను తగ్గిస్తుంది.
Read Also..
కాలంతో సంబంధం లేకుండా ఈరోజుల్లో బీరు తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది. దీన్ని తాగడంవల్ల కిడ్నీలోని రాళ్లు తొలగిపోతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ అది కేవలం అపోహే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.బీరు తాగితే మూత్ర విసర్జన అవుతుందని, అప్పుడు శరీరం నుంచి రాయి బయటకు రావడం సులువవుతుందని భావిస్తుంటారు. ఆల్కహాల్ అయినా, బీర్ అయినా కిడ్నీలో రాళ్లను బయటకు తీయడంలో ఏదీ సాయపడదని ఏసీపీ నివేదిక తెలుపుతోంది.మూత్రవిసర్జనను పెంచడానికి బీర్ పనిచేస్తుందని, ఇలా చిన్న రాళ్లను తీయడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ 5 మి.మీ కంటే పెద్ద రాళ్లను బయటకు తీయలేదని, వాటి పెరుగుదల మార్గం సుమారు 3 మి.మీ ఉంటుందని చెబుతున్నారు.
Read also..
Read also..
Read also..
ప్రస్తుతం మనం అన్నం వండినప్పుడు గంజిని పారబోస్తుంటాం.గంజిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.గంజిని మనం పనికిరానిదని భావించి పారబోస్తుంటాం. ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. అతిసారం, కడుపునొప్పి లాంటివాటితో ఇబ్బంది పడుతుంటే చిన్న గ్లాసులో పలచటి గంజి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే ఉపయోగం. ఇందులో క్యాలరీలు తక్కువ. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దీనివల్ల వారు కోల్పోయే విటమిన్స్, మినరల్స్ తిరిగి పొందుతారు.వేసవిలో శక్తి త్వరగా ఆవిరైపోతుంటుంది. అలాంటి వారు గంజి తాగడంవల్ల తక్షణమే శక్తిని పుంజుకుంటారు.
కొంతమందికి తినడానికి సమయం ఉండదు. హడావిడిగా ఏదోఒకటి తినేస్తుంటారు. ఈరోజుల్లో బయట తినేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దాదాపుగా అందరూ నిలబడి తింటున్నారు. పెళ్లిళ్లైనా, ఫంక్షన్స్ అయినా.. ఎక్కడైనా అందరూ నిలబడే తింటున్నారు. ఒకటి రెండుసార్లైతే పర్వాలేదుకానీ ప్రతిసారి.. అదేపనిగా నిలబడి తినడంవల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యునిపుణులు హెచ్చరిస్తున్నారు.నిలబడి తినడంవల్ల ఆకలిపై అవగాహన ఉండదు. ఎక్కువ తీసుకుంటారు.నిలబడి తినడంవల్ల పేగులు కుంచించుకుపోతాయి. తిన్నది జీర్ణం కాదు.గొంతు నుంచి నేరుగా కడుపులోకి వెళుతుంది. దీనివల్ల అన్నవాహికపై దుష్ప్రభావం పడుతుంది. దీని అల్సర్లు వస్తాయి.ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లిపోతుంది. కడుపునొప్పి, ఉబ్బరానికి దారితీస్తుంది. అంతేకాదు.. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది
రొమ్ము లేదా అండర్ ఆర్మ్ (చంక)లో కొత్త గడ్డ. రొమ్ము భాగం గట్టిపడటం లేదా వాపురొమ్ము చర్మం ఇరిటేట్ కావడం లేదా సొట్టపడినట్టు ఉండడం. చనుమొన ప్రాంతంలో లేదా రొమ్ములో ఎరుపు లేదా పొరలుగా ఉండే చర్మం. చనుమొన లోనికి పోయినట్టు లేదా అక్కడ నుంచి రసి లేదా ద్రవం కారడం, లేదా చనుమొన ప్రాంతంలో నొప్పి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ తెలియచేసే లక్షణాలు. వీటిలో ఏ ఒక్కటి లేదా కొన్ని ఉన్నా వెనువెంటనే వైద్య సహాయం తీసుకుని .. నిర్ధారణ చేయించుకోవాలి.
Read Also..
Read Also..






Total views : 90753