ఊపిరితిత్తులు, నోటి, గర్భాశయ, రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ భారతదేశంలో 5 అత్యంత సాధారణ క్యాన్సర్లు. 2018 సంవత్సరంలో భారతదేశంలో మహిళల్లో కనుగొనబడిన కొత్త క్యాన్సర్లలో 27.7% రొమ్ము క్యాన్సర్లే. భారతదేశంలో 2018 సంవత్సరానికి 1,62,468 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్తో కొత్తగా గుర్తించబడ్డారు. 2018 సంవత్సరానికి భారతదేశంలో 87,090 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్తో మరణించారు, ఇది ఆ సంవత్సరంలో ప్రపంచంలో రెండవ అత్యధికం.
Health
మెనోఫోబియా అంటే పీరియడ్ ఫోబియా. అమ్మాయిలలో, మహిళలలో నెలసరి పట్ల భయం, ఆందోళన ఉంటే దాన్ని మెనోఫోబియా అంటారు. మెనో అంటే రుతుక్రమం, ఫోబియా అంటే భయం. దీనిలో పీరియడ్స్ వస్తున్నాయంటే తీవ్రమైన ఒత్తిడి, బాధ, ఆందోళన, ఎగవేత ప్రవర్తనలు ఉంటాయి. మెనోఫోబియా కారణాలు ఒక్కో వ్యక్తికీ.. ఒక్కోలా ఉంటాయి. కొంతమంది మహిళలకు నొప్పితో కూడిన బాధాకరమైన పీరియడ్స్ ఉండొచ్చు. రుతుక్రమానికి సంబంధించిన సాంస్కృతిక నిషేధాలు ఉండొచ్చు. ఇవన్నీ కలిపి పీరియడ్స్ అంటే భయం, ఆందోళనకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.ఇది కాకుండా, సామాజిక కళంకం, విద్య లేకపోవడం, రుతుస్రావం గురించి అపోహలు కూడా వీటికి కారణం కావచ్చు.
ఈ రోజుల్లో పది మంది పెళ్లయిన జంటల్లో ఇద్దరు, ముగ్గురిలో సంతానం గురించి బాధపడుతున్న వారే.
చిన్న చిన్న చిట్కాలతో ఈ సంతనోత్పత్తి సమస్యకు చెక్ పెట్టవచ్చు. మనం తినే ఆహార అలవాట్లను మార్చుకుంటే ఈజీగానే గర్భం దాల్చే అవకాశాలు లేకపోలేదు.ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలాలు, ఇవి అండోత్సర్గం మరియు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పండ్లు ఫోలిక్ యాసిడ్, విటమిన్ C మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలాలు, ఇవి గర్భస్రావం నుండి రక్షించడంలో సహాయపడతాయి.తృణధాన్యాలు ఫైబర్, మినరల్స్ మరియు విటమిన్లకు మంచి సోర్సెస్, ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.ప్రోటీన్ అండాలు, మాంసం, చేపలు, పప్పులు మరియు గుడ్లు వంటి ఆహారాల నుండి లభిస్తుంది. ప్రోటీన్ స్పెర్మ్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది., ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు మద్యం మరియు పొగతాగడం వంటి అలవాట్లను నివారించడం ద్వారా మీరు మీ సంతానోత్పత్తిని మెరుగుపరచవచ్చు.
Read Also..
Read Also..
ఉల్లిపాయ టీని తాగడంవల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోవడంతోపాటు వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి, అందులో ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత అందులో ఒక యాలుక్కాయ, దంచిన మిరియాలు రెండు, సోంపు గింజలు అర టీ స్పూన్ వేసి 5 నుంచి 8 నిముషాల సమయం మరిగించాలి. దీన్ని గోరువెచ్చగా అయ్యేంతవరకు అలాగే ఉంచి ఆ తర్వాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. నిమ్మరసం, తేనె కలిపి దీన్ని తీసుకోవడంవల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది.కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో అధికంగా ఉన్నవారు దీన్ని తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. జుట్టుకూడా బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
టైపింగ్, పనులు చేయడం. స్వైపింగ్,, రాత ఇవన్నీ చేతులు వేళ్ళు మణికట్టు మీద దీర్ఘ కాలంలో సమస్యలు తీసుకొస్తాయి. కేవలం ఒకే తరహాగా మూవ్మెంట్స్ ఇవ్వడం వలన సమస్యలు వస్తాయి. అందుకే చేతులు వేళ్ళు. రిస్ట్ కి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. కేవలం 3 నిముషాలు ఖాళీ సమయంలో చేస్తే చాలు. 1) బొటనవేలు మణికట్టు మధ్య ఈ ప్రదేశంలో ఇలా మరో చేతి సహాయం తో ప్రెషర్ పెడుతూ ఇలా 10 కౌంట్స్ వత్తాలి. ఫార్వార్డ్ అలాగే బ్యాక్ వర్డ్ మోషన్స్ ఇలా చేయాలి. 2) అరచేతి కార్నర్ లో ఉండే చిన్న బోన్ ఇది ఇక్కడ మొదలు పెట్టి చివరిదాకా … మరో చేతి బొటనవేలు ఇతర ఫింగర్స్ సహాయం తో నిదానంగా ప్రెస్ చేయాలి, చేతిని ఇలా కదపాలి. 3) ఇలాగె పై వైపు కూడా వత్తుతూ ప్రెషర్ ఇవ్వాలి. వేళ్ళ కు ఇచ్చే వ్యాయామం చూడండి.వేళ్ళ గీతల మధ్య భాగం లో నెమ్మదిగా గుంజాలి. ఇలా చేస్తే బోన్స్ మధ్య ఇరుక్కున్న గాలి వచ్చేస్తుంది అలాగే ఫ్రోజెన్ ఐన బోన్స్ ఫ్రీ అప్ అవుతాయి కూడా. ఏది చేసినా నిదానంగా రిలాక్స్డ్ గా చేయాలి. అదే పని గా ఎక్కువ వద్దు.
Read Also…
దంతాలు బయటకు రాకముందే, శిశువులకు కొన్ని నోటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది . నోటి త్రష్ లేదా నోరు, నాలుకమీద తెల్లటి పూత. పసిపిల్లల నుంచే వారి నోటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా ఓరల్ త్రష్ మాత్రమే కాదు ఇతర ఓరల్ హెల్త్ సమస్యలు రాకుండా ఉంటాయి. బాక్టీరియా చేరడం మరియు ఇతర దంత సమస్యలను నివారించడానికి తప్పనిసరిగా మీ శిశువు నాలుకను జాగ్రత్తగా చూసుకోవాలి. శిశువు యొక్క నాలుక మరియు చిగుళ్ళను శుభ్రం చేయడానికి కేవలం శుభ్రమైన కాటన్ బట్ట, మీ వేలు చాలు. నోరు, నాలుక, చిగుళ్లు, దంతాలు ఇవన్నీ కూడా నోటి కిందకే వస్తాయి. వీటన్నిటిని శుభ్రంగా ఉంచడం తప్పనిసరి.
కొందరు బేబీస్ పుట్టడమే ఒకటి లేదా రెండు పళ్లతో పుట్టవచ్చు. వీటిని నేటల్ టీత్ అంటారు. ఇవి అరుదు. ఇవి బలహీనంగా ఉండి దానంతట అదే ఊడిపోతుంది. 6 నెలల – 12 నెలలకు మొదటి పన్ను వస్తుంది.అత్యధికంగా లోయర్ లేదా కింద పళ్ళు మొదట వస్తాయి. దాదాపు 3 ఏళ్లకు 20 పాల పళ్ళు వచ్చేసి ఉండాలి. 13 నెలలు నిండినా పళ్ళు రాలేదంటే వైద్య సహాయం తీసుకోవాలి. మొదటి పన్ను వచ్చే క్రమంలో బేబీస్ కి వాంతులు విరేచనాలు లైట్ ఫీవర్ ఉండవచ్చు. ఇవన్నీ టీతింగ్ తో పాటు వచ్చే సాధారణ సమస్యలు.
Read Also..
Read Also..
మెంతి ఆకులు గుండె జబ్బులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడం లో సహాయపడుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీ డైట్లో కచ్చితంగా మెంతి కూర ఉండేలా చేసుకోండి. ఈ ఆకులు తినడం ద్వారా శరీరం లో వేడి చేసి.. కొవ్వును కరిగిస్తాయి. వీటిలోని ఫైబర్.. మెటబాలిజంను పెంచి.. బరువు తగ్గేలా చేస్తుంది.బయటి ఆహారం ఎక్కువగా తినేవారికి అజీర్తి, గ్యాస్, పొట్టలో ఉబ్బరం వంటి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఇంట్లోనే వారానికి రెండుసార్లు మెంతి కూర చేసుకొని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నగా ఉండే ఈ ఆకులు చేసే ప్రయోజనం పెద్దదే. .. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్, కడపునొప్పి, మలబద్ధకం సమస్యలకు చెక్ పెడతాయి. మెంతి ఆకులను నేరుగా పప్పు లేదా వివిధ రకాల కూరగాయలతో కలిపి వండుకోవచ్చు.
Read Also..
Read Also..
తోటకూర ఆకుల్లో రక్తం లోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాలున్నాయి. ఇందులోని టోకోట్రినల్, విటమిన్ e కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ కారణం గా తోటకూర తింటే త్వరగా జీర్ణం అవుతుంది. రక్తం లో ‘లో డెన్సిటీ లైపోప్రోటీన్’ స్థాయిలను తగ్గిస్తుంది. తోటకూర యాంటీ -హైపర్ గ్లేసిమిక్ చర్యను ప్రదర్శిస్తాయి. తద్వారా టైప్-2 డయాబెటిస్ లో రక్తం లో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ ఆకులలోని ప్రోటీన్ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం లో సహాయపడుతుంది. ఆకలి బాధలను తగ్గించి, అతిగా తినకుండా నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తుంది.
భారతీయ స్త్రీలకు మెనోపాస్ యొక్క సహజ వయస్సు 47 సంవత్సరాలు. పాశ్చాత్య దేశం అయిన అమెరికా లో 51 సంవత్సరాలు సగటు వయసు, .ఇది సహజం కాగా// కొందరిలో కృత్రిమ మెనోపాస్ రావచ్చు. అందుకు కారణం అండాశయాలను వైద్య కారణాల వలన తొలగించడం. కానీ సహజంగా అయితే 12 నెలల పాటు ఏకధాటిగా ఎప్పుడైతే పీరియడ్ రాదో దానిని మెనోపాస్ అంటారు. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రధానమైనది. దీని వలన పునరుత్పత్తి కలిగి ఉంటారు, ఈ హార్మోన్ ఎప్పుడైటే తరుగుతూ పోతుందో అపుడు మెనోపాస్ గా పిలుస్తారు. ఈస్ట్రోజెన్ మన గుండె మరియు ఎముకలను రక్షిస్తాయి మరియు గుండెపోటులు, పగుళ్లు మరియు బోలు ఎముకల వ్యాధిని కూడా నివారిస్తాయి.





Total views : 90578