45 ఏళ్లు పైబడిన మహిళలు తరచుగా కాల్షియం లోపానికి గురవుతారు, ఎందుకంటే వారి పోస్ట్ మెనోపాజ్ కాలంలో వారి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. మహిళల్లో కాల్షియం జీవక్రియలో – ఈస్ట్రోజెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే మెనోపాస్ స్థాయిలో ఉన్న మహిళల్లో ఈస్ట్రోజెన్ తగ్గుతుందో అపుడు కాల్షియం కూడా తగ్గే అవకాశం ఉంది. అంతే కాదు కాల్షియం లోపం కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకల అరుగుదల…ఆస్టియో పోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా కాస్త రాపిడికి ఎముకలు పుటుక్కున విరిగే అవకాశం ఉంది.
Health
టీ ఆస్వాదించడం చాలా మందికి ఇష్టం. టీతో కొన్ని స్నాక్స్ కూడా తింటారు. అయితే, కొన్ని స్నాక్స్ తినకపోవడమే మంచిది. ఫ్రిజ్ నుంచి తీసిన చల్లటి ఫుడ్స్ కూడా తీసుకుని టీలు తాగడం అస్సలు మంచిది కాదు. ఐస్ క్రీమ్స్, బఠానీలు, స్వీట్ కార్న్ వంటి పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. చాలా మందికి టీ తాగుతూ వేడి వేడి బజ్జీలు, బోండా, పకోడి వంటివి తినడం అలవాటు. ఎపుడైనా సరే ఓకే కానీ రెగ్యులర్ గా తినే గ్యాస్ క్రియేట్ అవుతుంది. వేడివేడి టీతో పండ్లని తీసుకోవద్దు. రెండూ శరీరంలోకి వెళ్ళినప్పుడు కడుపులో ఇబ్బంది తలెత్తుతుంది. ఉప్పగా, ఆమ్లంగా మారుతుంది.నిమ్మరసం వంటి విటమిన్ సి ఫుడ్స్ టీతో కలిపి తీసుకోవద్దు. సిట్రిక్ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది టీలోని కెఫిన్‌తో కలిసి జీర్ణసమస్యలకి కారణమవుతుంది.ఇప్పుడు చెప్పేవన్నీ కూడా టీతో పాటు వీటిని తీసుకోకపోవడం మంచిది.
ఇంక్ నట్, లేదా కరక్కాయ పేరు ఏదైనా సరే దగ్గు కి భేషుగ్గా పనిచేస్తుంది. కేవలం కాఫ్ రెమిడీ గా మాత్రమే కాదు మలబద్ధకం తగ్గిస్తుంది అలాగే డైజేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇక దగ్గు జలుబు, గొంతు నొప్పి, కఫము విరుగుడు గా బాగా పనిచేస్తుంది. 1/4 Tea స్పూన్ కరక్కాయ పొడిని గోరు వెచ్చటి నీటిలో కలిపి రోజుకు ఒకటి రెండు సార్లు సమస్య తీవ్రత బట్టి వాడుకోవచ్చు. కరక్కాయ నేరుగా చిన్న ముక్క ఒకటి నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ ఉన్నా కూడా ఊరట లభిస్తుంది. దగ్గు జలుబు, గొంతు నొప్పి, మలబద్ధకం, జీర్ణశక్తి పెంచేందుకు ప్రతి రోజు తగు మోతాదులో కరక్కాయ తీసుకోవచ్చు.
వేప ఆకు, వేపనూనె – దోమలను తరిమి కొట్టేందుకు నేచురల్ మస్కిటో రేపేలెంట్ గా పనిచేస్తాయి. కేవలం దోమల నుంచి మాత్రమే కాదు, క్రిమి కీటకాలనుంచి కూడా రక్షణ ఇస్తాయి. ఇంట్లో దోమల ఎక్కువగ ఉంటె వేప నూనె కొద్దిగా కొబ్బరి నూనె తో కలిపి చర్మం ఎక్స్పోస్ అయ్యే చోట ముఖ్యంగా కాళ్ళు చేతులకు రాసుకోవచ్చు. లేదంటే ఎండిన వేపాకులను కాల్చి ఆ పొగ ఇంట్లో అలాగే ఆరుబయట ఉంచితే కూడా దోమలు పోతాయి. అనేక రకాల ఇతర బ్యాక్టీరియల్ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పోగొట్టాలంటే నీటిలో వేపాకులను వేసి ఆ నీటితో స్నానం చేయవచ్చు. గజ్జి దురద తామర వంటి ఇన్ఫెక్షన్స్ కు వేప నీరు ఉపశమనం ఇస్తుంది. నోటి ద్వారా వేప రసం, వేపాకు చూర్ణం తీసుకొనే వారు తస్మాత్ జాగ్రత్త. అతిగా నోటి ద్వారా వేప తీసుకోవడం వలన కిడ్నీలు. లివర్ దెబ్బతినే అవకాశం ఉంది.
పాలిచ్చే తల్లులు మునగాకు తినడం ద్వారా పాలు బాగా పడతాయి. బాలింతలు, గర్భిణులు మునగాగాకు రసం తాగడం వలన వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా తల్లులతో పాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాల నుండి వచ్చే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు లో లభిస్తుంది. మునగాకు తినడం ద్వారా థైరాయిడ్ పనితీరు నియంత్రించుకోవచ్చు. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.
విటమిన్ ఎ అధికంగా ఉండడం వలన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పాలకూర లో ఫైబర్, ఐరన్ అధికం అందుకే అందరికి మంచిదే కానీ స్త్రీలకు ప్రత్యేకంగా మంచిది. పాలకూర తీసుకోవడం వలన విటమిన్ డి ని వస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. బోలు ఎముకలల సమస్యను కూడా పరిష్కరిస్తుంది. పాలకూరను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అనీమియా సమస్యతో బాధ పడేవారు పాలకూరని తప్పక రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. రెగ్యులర్ గా కనీసం 4 వారాలు తీసుకొంటే హిమోగ్లోబిన్ అమాంతంగా పెరుగుతుంది. ఐరన్ తో పాటుగా సి విటమిన్ తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా శరీరానికి ఐరన్ బాగా పడుతుంది. పాలకూర వండేటప్పుడు అతిగా వేయించడం లేదా ఉడకబెట్టకూడదు. ఉడకబెట్టిన ఆకుకూరను చల్లనీటితో కడిగినందువలన కలర్ మారకుండా ఉంటుంది. ఆకుకూర కడిగి తర్వాత కట్ చేసుకోవాలి.
బాలికలలో యుక్తవయస్సు లేదా ప్యూబర్టీ సాధారణంగా 8 లేదా 9 సంవత్సరాల నుంచి దాదాపు 14 సంవత్సరాల మధ్య కావచ్చు. ఇలా మరిన్ని చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇది మీ శరీరం అభివృద్ధి చెందే మరియు పరిపక్వం చెందే సమయం. యుక్తవయస్సు ఆడపిల్ల శరీరాన్ని సిద్ధం చేస్తుంది కాబట్టి ఆమె తల్లి అయ్యే అవకాశం పొందినట్టు. శరీరంలోని హార్మోన్లు అని పిలువబడే సహజ పదార్ధాల వల్ల మార్పులు సంభవిస్తాయి.
బాలికలలో యుక్తవయస్సు యొక్క మొదటి సంకేతంగా రొమ్ము అభివృద్ధి గా చెప్పుకోవచ్చు. ప్యూబర్టీ లేదా యుక్తవయసు లక్షణాలు కనిపించే వయసు నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, గత 40 సంవత్సరాలలో, ఇది దశాబ్దానికి సగటున 3 నెలలు తగ్గింది. యుక్తవయస్సు యొక్క సంకేతాలు మరికొన్ని : ప్రయివేట్ పార్ట్స్ లో అలాగే శరీరం మీద ఇతర భాగాల్లో వెంట్రుకల పెరుగుదల. గ్రోత్ స్పర్ట్. రొమ్ము అభివృద్ధి.రుతుక్రమం ప్రారంభం, మొటిమలు. బాలికలలో, యుక్తవయస్సు ఒకసారి ప్రారంభమైతే, ఇది దాదాపు 2 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో నే మొదటి పీరియడ్ వచ్చే అవకాశం ఉంది.
Read Also..
Read Also..
గత దశాబ్దంలో, వివిధ దేశాల నుండి అనేక అధ్యయనాలు రుతుక్రమంలో సగటు వయస్సును నవీకరించాయి. మొదటి సారిగా ఆడపిల్ల జీవితంలో వచ్చే పీరియడ్ నే మెనార్కి అంటారు. రాను రాను మొదటి ఋతుచక్రం వయసు తగ్గుతూ పోతోంది. అభివృద్ధి చెందిన దేశాలలో చాలా మంది బాలికలలో 10 మరియు 16 సంవత్సరాల మధ్య వయస్సులో మెనార్కి సంభవిస్తుంది. పోషకాహార లోపం, పేదరికం, సామజిక ఆర్ధిక స్థితి, కొంత మేరకు జన్యువులు, శారీరక దృఢత్వం మొదలైన అంశాలు మెనార్కి వయసును ప్రభావితం చేస్తాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాలలో 1840లో 17 సంవత్సరాలకు నమోదై – నేడు 2000లో దాదాపు 12 సంవత్సరాలకు మెనార్కి యొక్క సగటు వయస్సు తగ్గిందని అనేక అధ్యయనాలు నివేదించాయి. నేడు 9 ఏళ్ల నుంచి 13 ఏళ్ళ మధ్య మెనార్కి మొదలు కావడం చూస్తున్నాం.
మిగలపండిన అరటిపండ్లు పారేయకుండా స్మూత్ గ పేస్ట్ చేసి కాళ్ళ పగుళ్ళకు మాత్రమే కాదు పూర్తిగా పాదాలకు పట్టించండి. 20 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడిగేయాలి. కనీసం 2 వారాలు రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనెలో పలు యాంటీ సెప్టిక్ గుణాలు ఉండడం కారణంగా గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచాడు తేనె వేసి కాళ్ళను ఆ నీటిలో ముంచి 20 నిముషాలు ఉంచి తేలికపాటి స్క్రబ్ ఉపయోగించి రుద్ది, తుడుచుకొని, మాయిశ్చరైసర్ రాసుకోవాలి. వాసెలైన్ పెట్రోలియం జెల్లీ ఒక చెంచాడు తీసుకొని అందులో ఐదారు చుక్కల నిమ్మ రసం కలిపి ఆ మిశ్రమాన్ని పదాలు పగుళ్ల మీద రాస్తూ మసాజ్ చేయాలి. నిద్ర కు ముందు ఇలా ఒకటి నుంచి రెండు వారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మీ పార్టనర్ మిమ్మల్ని కౌగిలించుకొన్నపుడు నడుము ఇరువైపులా చేతులు వేసినపుడు పట్టుకోవడానికి వీలుగా ఉండే ఫ్యాట్ అక్యుమిలేషన్ యే ఈ లవ్ హ్యాండిల్స్. ఇవి స్త్రీలలో ఎక్కువ. అందానికి నిర్వచనం గా చెప్పుకొనే ఈ లవ్ హ్యాండిల్స్ ఆక్చుల్ గా ఫ్యాట్ ఎక్కువ చేరితే వచ్చేవి. సో మీ నడుము ఇరువైపులా ఇవి ఉంటె మీరు శరీరానికి కావల్సిన exercise చేయడం లేదని లెక్క. సో ఫిట్ గా ఉంటేనే అందం అని గుర్తు పెట్టుకోండి. కంటి నిండా నిద్ర. మంచి ఆహారం. కావాల్సిన మేరకు డైలీ exercise ఇవి చేస్తే లవ్ హ్యాండిల్స్ యిట్టె పోతాయి.






Total views : 90537