సాధారణంగా అనేక మందులు, చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఆముదాన్ని ఉపయోగిస్తారు. ఈ నూనె మలబద్ధకం చికిత్సలో సహాయపడే సహజ భేదిమందుగా పనిచేస్తుంది. అయితే ఇది మీ జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా గొప్పగా పనిచేస్తుంది.సహజ కండిషనింగ్ లక్షణాలతో నిండిన.. ఆముదం మీ తలకు తేమను అందిస్తుంది. ఇది మీ జుట్టును లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది, ఫలితంగా మీ జుట్టును బలంగా, మృదువుగా మారుతుంది. అనేక ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలతో పుష్కలంగా నిండిన ఆముదం.. చర్మం పొడిబారడం, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది కాలిన గాయాలు, ప్రెజర్ అల్సర్లు, డయాబెటిక్ అల్సర్లు, శస్త్రచికిత్స గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. దద్దుర్లు, దురద సమస్యలను కూడా నయం చేస్తుంది.
Health
ఫ్యాట్ లాస్ కోసం లేదా అధిక బరువు తగ్గడానికి వేడి నీరు తాగడం అలవాటు చేసుకొంటారు కొందరు. దీని వలన మంచి ఫలితం ఉండవచ్చు. కానీ మీకు తెలుసా? వేడి నీరు మాత్రమే కాదు చల్ల నీరు కూడా వెయిట్ లాస్ కోసం అలాగే ఫ్యాట్ కరిగించేందుకు మంచిదే. మధ్యాహ్నం భోంచేసిన గంటకు ఒక గ్లాసుడు నీటిలో ఒక నిమ్మ చెక్క పిండి తాగితే మంచిది. జీర్ణ శక్తి పెంచడం తో పాటు ఫ్యాట్ కరిగిస్తుంది కూడా. అన్నిటికంటే మించి డీటాక్స్ అంటే శరీరం లోని హానికారక మూలకాలను ఫ్లష్ చేస్తుంది నిమ్మ. గ్రీన్ టీ కూడా ఫ్యాట్ లాస్ కోసం మంచిదే. సొరకాయ కొద్దిగా స్టీమ్ చేసి ఆ జ్యుస్ తగిన ఫ్యాట్ కరుగుతుంది. అలాగే కీరా జ్యుస్ లో ఒక చుక్క లెమన్ వేసి తాగావచు. మంచి ఫలితం ఉంటుంది.
యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఏలకుల వల్ల ఎంజైమ్‌ల స్రావం ప్రేరేపితం అయి జీర్ణక్రియకు సహాయపడుతుంది. తద్వారా ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి సాధారణ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. యాలకులు సహజ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. నిత్యం నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి నోరు తాజాగా ఉంటుంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ తాజా శ్వాసను అందిస్తుంది. అంతేకాకుండా దంత సమస్యలు కూడా దూరమవుతాయి.యాలకులు సహజసిద్ధమైన రక్తాన్ని పల్చగా చేసేలా పనిచేస్తుంది. దీనివల్ల సిరల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
భారతీయ సాంప్రదాయాల్లో పసుపు వాడకానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. యాంటిబయోటిక్ గా వాడే పసుపును ప్రతిరోజు చిటికెడు వాడడం వలన ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా ఇది పనిచేస్తుంది. టైప్ -2 డయాబెటిస్ చికిత్సలో పసుపు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో వాపులు రాకుండా నిరోధిస్తుంది …అదేవిటంగా చెక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. దీంతో టైప్ -2 డయాబెటిస్ చాలా వరకు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. సాధారణ గాయాలతో పాటు బ్లీడింగ్ సమస్యను తగ్గించడంలోనూ పసుపు బాగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ,యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంది టిష్యు రిపేర్ కు వికూడా దోహదపడుతుంది. అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధ సమస్యలకు కూడా పసుపు ఉత్తమమైన మార్గమని హెల్త్ ఎక్స్పర్ట్స్. ..రోజువారీ పనులతో అలసిపోయే వాళ్ళతో పాటు ఒత్తిడికి గురయ్యేవారికి కూడా పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. శరీరంలో చేదు కొలెస్ట్రాల్ స్థాయుల్ని నియంత్రించడంలోనూ పసుపు ఉపయోగం చాలా ఉంది కాబట్టి ప్రతిరోజు చిటికెడు పసువును ఎదో రకంగా వాడడం మంచిది.
Read Also..
Read Also..
గుండెను పదిలంగా కాపాడుకోవాలంటే అరటి పండ్లు తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.పోషకాలు,కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే అరటిపండ్లలో పోషకాల స్థాయిలను గమనిస్తే ఒక 80గ్రాముల అరటిపండును తీసుకోవడం ద్వారా 65కిలో క్యాలరీల ఎనర్జీ,1గ్రాము ప్రోటీను,0.1 ఫాట్16. 2 గ్రాముల కార్బోహైడ్రేట్స్,1.1 గ్రాముల ఫైబర్,264మిల్లి గ్రాముల పొటాషియం అందుతాయి. అరటిపండ్లలో ఎక్కువగా ఉండే పెక్టిన్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాకరిస్తుంది. అరటిపండ్లలోని ఫైబర్ కారణం గా కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్స్ ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు పనిచేస్తాయి.
ఎంత బిసి ముఖ్యమైన పని ఉన్నా సరే ఒకే చోట గంటలకొద్దీ కూర్చొని పని చేయడం మంచిది కాదు. కుర్చీలకు అతుక్కొని చేసే పనులు పొగ తాగే అలవాటు కన్నా ప్రమాదం. ఇలా చేయడం వలన ఊపిరితిత్తులు,బ్రెస్ట్ ,పెద్దపేగు,క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందని చాలా అద్యాయాల్లో తేలింది. గంటకొద్దీ డ్రైవింగ్ చేయడం కూడా ముప్పుగానే పరిణమిస్తుంది. దీన్ని నివారించాలంటే రోజు రెండుగంటలకు ఒక సారైనా లేచి కాసేపు తిరగాలి . శరీరాన్ని కాసేపు అటు ఇటు తిప్పా
పువ్వులోని గింజల నుంచే పొద్దు తిరుగుడు ఆయిల్ ను తీస్తారు. మనం ఇళ్లలో వంట నూనె కోసం ఎక్కువగా సన్ ఫ్లవర్ నూనెనే వాడుతుంటాం. అయితే.. సన్ ఫ్లవర్ గింజల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. నిజానికి సన్ ఫ్లవర్ ఆయిల్ గుండె కు మంచిదంటారు. అందుకే చాలామంది ఆ ఆయిల్ నే వాడుతుంటారు. కానీ.. మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. పొద్దు తిరుగుడు నూనెతో మీ పొడిచర్మాన్ని సైతం మృదువుగా మార్చుకోవచ్చు. శరీరానికి కావల్సిన కీలక పోషకాలను అందించడంతో పాటు.. శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగిస్తుంది. పొద్దు తిరుగుడు నూనె పొడి చర్మం ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడే సహజ నూనె. విటమిన్ E అధికంగా ఉండే ఈ నూనె తేమను బంధిస్తుంది. చర్మ కణాలలో తేమను నిలుపుకుంటుంది. పొద్దు తిరుగుడు నూనె ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది. కణాలను పునరుద్ధరించడానికి కూడా సహాయపడుతుంది.
కాన్స్టిపేషన్ సమస్యనుండి బయటపడాలంటే అరటిదూట తినాల్సిందే. అవును అరటి దూట లో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో మలబద్దకాన్ని దూరం చేస్తుంది. అధిక క్యాలరీలు ఉన్న ఆహరం బదులు అరటి కాడని ఆహారంలో చేర్చుకుంటే అధికబరువు ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అరటికాడలో మూత్రపిండాలను శుభ్రపరచడం తో పాటు కిడ్నీలలోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా పొటాషియం మరియు విటమి బి6 లను కలిగి ఉంటుంది విటమిన్ b6 వలన హిమోగ్లోబిన్ మరియు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి శరీరం లో చేరే ఇన్ఫెక్షన్స్ తో పోరాడే సామార్ధ్యాన్ని పొందవచ్చు. అదేవిధంగా అరటి దూటలోని పొటాషియం శరీర కండరాల పనితీరును పెంచడమే కాకుండా అధిక బ్లడ్ ప్రెసర్ ని అదుపులో ఉంచుతుంది. అరటికాడ ను రోజువారీ తినే ఆహారం లో భాగంగా జ్యూస్‌లలో లేదా సలాడ్ లలో వాడుకోవచ్చు .
బెస్ట్ రీఫ్రెష్మెంట్ డ్రింక్ ఏది అంటే కచ్చితంగా కొబ్బరి నీళ్లు అనే చెప్పాలి. కేవలం ఎండాకాలం లో మాత్రమే కాకుండా ఏ సీసన్ లో అయినా సరే శరీరానికి కావాల్సిన డీహైడ్రేషన్, ఎండ వేడిమి తగ్గడమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. నిస్సత్తువను తరిమికొట్టే.. కొబ్బరినీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 250 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 10 శాతం – విటమిన్ సి, 15 శాతం – మెగ్నీషియం, 17 శాతం – మాంగనీస్, 17 శాతం – పొటాషియం, 11 శాతం సోడియం, 6 శాతం కాల్షియం ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని,వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యం గా ఉంచుతాయి. కొబ్బరినీళ్లు మలబద్దకాన్ని దూరం చేస్తాయి. జీర్ణ శక్తిని కూడా పెంచుతాయి. కొబ్బరి నీళ్లలో ఎలెక్ట్రోలైట్స్,విటమిన్లు అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో ఉండే ఆల్కలైన్ గుణాలు ఎసిడిటీ ని దూరం చేస్తాయి. గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగడం వలన విటమిన్ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వేధించే.. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.
బీట్రూట్, క్యారేట్ ఎక్కువగా తినాలి. పాలకూర,టమాటాలు తినాలి. నిమ్మకాయతో పాటు విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవాలి. క్యాబేజీ ,వాల్ నట్స్,అవకాడోలు తినాలి. వెల్లుల్లి,యాపిల్స్ తినాలి. ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలు తినాలి. గ్రీన్ టీ ఎక్కువగా తాగాలి. వీటిని నిత్యం తెసుకోవడం తో లివర్ లోని విష పదార్ధాలు తొలిగిపోయీ దాని పనితీరు మెరుగుపడుతుంది.




Total views : 90416