లిప్ స్టిక్ వేసుకునే ముందు పెదాలకు మాయిశ్చరైజ్ చేసుకోవాలి. తర్వాత లిప్స్టిక్కు సరిపోయే లిప్ లైనర్ను ఉపయోగించాలి. తద్వారా పెదవుల అంచులు బ్రైట్‌గా కనిపిస్తాయి. లిప్ స్టిక్ వేసుకునేటప్పుడు పెదవుల మధ్యభాగం నుంచి ప్రారంభించి.. పెదవుల సహజ ఆకృతిని అనుసరించి చివర వరకు వేసుకోవాలి. చివరగా, పెదవులు మెరిసేలా చేయడానికి లిప్ గ్లాస్ వేసుకోవాలి
Health
మెట్లు ఎక్కడం సైకిల్ తొక్కడం వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ రోజులలో గుండె సంబంధిత వ్యాధులు సాధారణం అయినా ఇది చాలా ప్రమాదకరం. పేలవమైన జీవన శైలి, ఎక్కువ గంటలు కూర్చొని పని చేయడం, శారీరక శ్రమ తక్కువగా ఉండడం వంటి అనేక అంశాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అటువంటి పరిస్ట్జ్హితీలో మీరు వారానికి ఒకసారి సైకిల్ తొక్కడం లేదా నడవడం వంటి ఏదైనా శారీరక శ్రమకు సమయం ఇవ్వకపోతే, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మెట్లు ఎక్కడం మంచి మార్గం. ఇది గుండె జబ్బులు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
బరువు తగ్గాలంటే ఉదయాన్నే పరగడుపున ఖర్జురాలు తినాలి. ఉదయాన్నే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఖర్జురాలు తింటే రోజంతా ఆకలి లేకుండా యాక్టివ్ గా ఉంటారు. రాత్రి సమయాల్లో ఖర్జురాలు తినకూడదు. ఇవి అంత సులభంగా అరగవు. పరగడుపున ఖర్జురాలు తినడం వలన శరీరానికి పోషకాలు అందుతాయి దీనిలోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయి లను పెంచుతాయి. ఉదయాన్నే డేట్స్ తినడం వల్ల జీవక్రియలు సక్రమంగా జరిగి అధిక మొత్తంలో క్యాలరీలు ఖర్చవుతాయి. దేడ్స్ ను ఓట్స్ తో కలిపి స్మూతీ , షేక్స్ చేసుకొని తాగితే కడుపు నిండుగా ఉంది ఆకలి వేయదు. ఫలితంగా ఇతర పదార్థాలు ఏమి తినలేం ఫలితంగా తక్కువ క్యాలరీలతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.





Total views : 90260