Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home International అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి..!

అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి..!

by Satya
Indian student died in America

అమెరికా(America)లోని ఒహాయోలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. క్లీవ్‌ల్యాండ్‌(Cleveland)లోని ఒహాయోలో భారతీయ విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణం చాలా బాధాకరమని, ఈ కేసును పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారని, ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది.

ఇది చదవండి: జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం..!

ఉమా మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు పంపించడంతో పాటు అవసరమైన ఇతర సహాయాన్ని అందిస్తామని కూడా ఆ ట్వీట్‌లో ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. అమెరికాలో నివసిస్తోన్న భారతీయులు, భారత మూలాలున్న విద్యార్థుల మరణాలు ఇటీవల పెరిగాయి. తాజాగా ఉమా సత్యసాయి మరణంతో అమెరికాలో ఉన్న భారతీయ సమాజం షాక్‌కు గురైంది. తాజా ఘటనతో కలిపి ఈయేడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు అమెరికాలో 10 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Follow us on : Google News  మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రష్యాతో కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ ప్రతిపాదన.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రత్యేక రాయబారులు రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు …
దక్షిణ అమెరికా ఖండంలో భారీ పేలుడు.
దక్షిణ అమెరికా ఖండంలోని బొలీవియాలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బొలీవియాలోని ఓ మిలిటరీ …
నేపాల్‌కు మరో భారీ ముప్పు.
నేపాల్‌కు మరో భారీ ముప్పు పొంచి ఉంది. దార్చులా జిల్లాలోని అపి హిమల్‌ రూరల్‌ ప్రాంతం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: