Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News రేవంత్‌ పాలన కంటే కేసీఆర్ పాలనయే బాగుంది-జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

రేవంత్‌ పాలన కంటే కేసీఆర్ పాలనయే బాగుంది-జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

by CVR NEWS

రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుండేదంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి రైతును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకొందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు ఆశించిన పాలన రాలేదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ బెటర్ అని.. రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మెరుగైన నాయకుడని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు.

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 13న జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. కేటీఆర్ ఇవాళ జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించారు. జీవన్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా, మంత్రిగా పని చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు

 

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: