భారత్-చైనా మధ్య ఒకవైపు సరిహద్దు వివాదాలు నెలకొనగా. మరోవైపు చైనా శాస్త్రవేత్త ఒకరు అంతరిక్ష విజయాల్లో భారత్ పాత్రను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ చైనా శాస్త్రవేత్త భారత్ చంద్రయాన్ ప్రయోగం ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రయాన్ -3 రోవర్ గత నెలలో చంద్రుడిపై అడుగు పెట్టి, ఎన్నో రకాల కీలక సమాచారాన్ని పంపిస్తుండడం తెలిసిందే. పైగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇది అడుగు పెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ ఘనత సంపాదించుకుంది. చైనాకు కూడా ఇది సాధ్యం కాలేదు. దక్షిణ కొన వరకే చేరుకుంది.
Latest News
భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వీసాల జారీలో రికార్డు సృష్టించింది. 2023లో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేసింది. గతంలో ఓ ఏడాది కాలంలో అమెరికా ఎంబసీ ఎప్పుడూ ఇన్ని వీసాలు జారీ చేయలేదు. ఇప్పుడు కొన్ని నెలల వ్యవధిలోనే ఏకంగా ఒక మిలియన్ వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన వీసాల్లో 10 శాతం భారతీయులకే కేటాయించారు.ఈ ఘనత పట్ల అమెరికా రాయబార కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. మిషన్ వన్ మిలియన్ పూర్తయిందని తన సోషల్ మీడియా ఖాతాలో సగర్వంగా ప్రకటించింది. ఇది ఇంతటితో ఆగదని, రాబోయే కాలంలో మరింత మంది భారతీయులకు అమెరికా వెళ్లే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. వీసాల జారీలో మరింత వృద్ధి సాధిస్తామని అమెరికా ఎంబసీ పేర్కొంది.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని, సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. కర్ణాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… మన దేశానికి నెహ్రూ తొలి ప్రధాని కాదని, సుభాష్ చంద్రబోస్ ప్రథమ ప్రధాని అన్నారు. నేతాజీ బ్రిటిష్ వారికి భయం రుచిచూపించడం వల్ల వాళ్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయారన్నారు. భారతీయులు చేసే నిరాహార దీక్షల వల్ల లేదా సత్యం, ధర్మం అంటూ ఒక చెంపపై దెబ్బ కొడితే మరో చెంప చూపించడం వల్ల కానీ స్వాతంత్ర్యం రాలేదన్నారు.
ఆకలి సూచీలో హంగర్ ఇండెక్స్ నివేదికపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. 140 కోట్లమంది దేశ ప్రజల్లో 3000 మందిని పిలిచి, ఆకలేస్తుందా అని వారిని పశ్నించి ఇండెక్స్ రూపకర్తలు ఆకలి సూచీని లెక్కిస్తారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకంటే సిగ్గుచేటు ఏమీ ఉండదు. మీ మాటల్లో మీ అజ్ఞానం కనిపిస్తోంది. కొంతమందిని పిలిచి, ఆకలిగా ఉందా అని అడిగి, ఈ సూచీని సిద్ధం చేస్తారని మీరు నిజంగా భావిస్తున్నారా..? అని కాంగ్రెస్ నేత సుప్రియా ష్రినేట్ ట్వీట్ చేశారు. ఆకలిని అపహాస్యం చేయొద్దు. మీరు ఎక్కడికి వెళ్లినా తగినంత ఆహారం అందుబాటులో ఉంటుంది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రిగారు.. అహంకారానికి మరో రూపంగా ఉన్నారు ‘అంటూ శివసేన నేత ప్రియాంకా చతుర్వేది మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు వివరించారు.
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేశామన్నారు. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి దిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నాలు చేశారు.. కానీ, మహిళలకు బీఆర్ఎస్ సీట్లు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు.. ఇవాళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో గణేష్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయిన కూడా నిమజ్జనం కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడం, నిరసనలు, తదితర పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే హైదరాబాదులో నిరసలేంటని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, కేటీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తప్పుబట్టడం వంటి అంశాలపైనా కవిత తన అభిప్రాయాలను పంచుకున్నారు.
పక్క రాష్ట్రంలోని రాజకీయాలపై ఉన్న శ్రద్ధ వారికి ఇక్కడి రాజకీయాలపై లేకపోవడం శోచనీయం అని రేవంత్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ దేశం మొత్తానికి రాజధాని కాబట్టి అక్కడ ధర్నాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని కవిత పేర్కొన్నారు. హైదరాబాదులో ధర్నా చేయాలంటే తెలంగాణ అంశాలపై ధర్నా చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
ఆంధ్రా అంశాలపై ఇక్కడెందుకు ధర్నాలు చేయాలి? అలాంటి కార్యక్రమాలతో హైదరాబాదులో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదా? అని మాత్రమే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారని కవిత స్పష్టం చేశారు. దాన్ని పెద్ద వివాదం చేస్తున్నారని, ఎవరైనా ఎక్కడికైనా రావొచ్చు అంటూ రేవంత్ రెడ్డి అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయని, ఎప్పుడూ ధర్నాలు, గొడవలు, నిరసనలు, కర్ఫ్యూలు ఉంటాయని, ఆ పార్టీ చరిత్ర అదేనని కవిత ఎద్దేవా చేశారు. పరిస్థితులను బట్టి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత విమర్శించారు.
చంద్రబాబు అరెస్ట్ అంశంపైనా కవిత తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. “ఒక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పక్క రాష్ట్రంలో చర్చ పెట్టాలనుకోవడం దారుణం. దేశంలో అనేక మంది రాజకీయ నేతలు వేధింపులకు గురవుతుండడడం చూస్తూనే ఉన్నాం. ఇది ఆయా పార్టీలు, వారి న్యాయ విభాగాలు చూసుకోవాల్సిన విషయం. తమ సమస్యను ప్రజల సమస్యగా చెబుతూ ప్రతి ఒక్కరినీ ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని చూడడం అన్యాయం. ఇది టీడీపీ, వైసీపీ చూసుకోవాల్సిన విషయం” అని కవిత ఉద్ఘాటించారు.
విజయవాడ ఏసిబి కోర్టులో చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్ మరియు సిఐడి కస్టడీ పిటిషన్ లపై విచారణ టిడిపి తరఫు దూబే సిఐడి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం లో క్యాష్ పిటిషన్ పై వాదనలు జరగబోతున్నాయి 17/a చంద్రబాబు నాయుడు కు వర్తించే అవకాశం ఉన్నప్పటికీ 2015లో జరిగిన స్కాం కావడంతో సిఐడి తరపు న్యాయవాదులు అడ్డుపడే అవకాశం ఉందంటున్న అడ్వకేట్ సుధాకర్ తో అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురంలో శుక్రవారం జగనన్న వాహన మిత్ర కార్యక్రమం ద్వారా 2,75, 931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున 275.93 కోట్ల రూపాయలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్న నేపద్యంలో సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా ఐదవ ఏడాది జగనన్న వాహన మిత్ర పథకం ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరుస్తున్నామని మంచి కార్యక్రమాలు చేస్తుంటే జనసేన పని పాట లేని కార్యక్రమాలు చేపడుతున్నాయని, పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకుంటుంటే జనసేన కార్యకర్తలకు రోడ్లమీద మీకేం పని అంటున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని… అన్ని ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆధారాలు ఉండటం వల్లే ఆయనకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదని అన్నారు. ఏ వయసులో తప్పు చేసినా నేరం నేరమేనని చెప్పారు. భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోబోతున్నారని తెలిపారు.
చంద్రబాబు లక్కీ నెంబర్ 23 అని… తమ పార్టీకి చెందిన 23 మందిని ఆయన లాక్కున్నారని… 2019లో ఆయనకు వచ్చిన సీట్లు కూడా 23 అని… ఆయన జైలుకు వెళ్లిన తేదీ కూడా 23 అని అనిల్ ఎద్దవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలే సైలెంట్ గా ఉన్నారని… తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు మాత్రం లేనిపోని హడావుడి చేస్తున్నారని విమర్శించారు.





Total views : 194211