Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh డ్రగ్స్ అడ్డాలుగా మెడికల్ కాలేజీలు

డ్రగ్స్ అడ్డాలుగా మెడికల్ కాలేజీలు

by Satya
lokesh

ఒంగోలు మెడికల్ కాలేజీలో జరిగిన గంజాయి బ్యాచ్‌ దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ప్రజల ఆరోగ్యాలు కాపాడే భావి డాక్టర్లు గంజాయికి బానిసలై ఉన్మాదులుగా మారి కొట్టుకుని ఆస్పత్రిలో పేషెంట్లు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా మారాయని ఆరోపించారు. మత్తుకు బానిసైన కొంతమంది మెడికోల హింసాప్రవర్తన చూశాక రాష్ట్రంలో పరిస్థితిపై భయమేస్తోందన్నారు. స్కూల్లో విద్యార్థులు గంజాయికి బానిసలు కావడం యువగళం పాదయాత్రలో చూశానని చెప్పారు. ఈ క్రమంలో యువత భవిత నాశనం అవుతుందనే ఆందోళనతో ఏపీలో డ్రగ్స్ దందాలను కట్టడి చేయాలని గతంలో ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. అయినా ఏపీలో గంజాయి తీవ్రత తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు టీడీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014194
Total views : 79533

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.