పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ లో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు తీవ్ర సంక్షోభానికి దారితీశాయి. పార్టీలో మొదలైన అసంతృప్తి కాస్తా ఇప్పుడు నేతల వలసల పర్వానికి కారణమైంది. తాజాగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బరాయిక్ తన పదవికి రాజీనామా చేసారు. నిజానికి తృణమూల్ కాంగ్రెస్‌కు రాజ్యసభలో ఇది వరుసగా తగిలిన మూడో పెద్ద షాక్. ప్రకాష్ చిక్ బరాయిక్ కంటే ముందే పార్టీలో అత్యంత కీలక నేతలుగా ఉన్న సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ సైతం తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు కరడుగట్టిన నేతలు పార్లమెంట్ ఎగువ సభకు గుడ్‌బై చెప్పడంతో రాజ్యసభలో టీఎంసీ బలం ఒక్కసారిగా పడిపోయింది. తాజా రాజీనామాతో ఎగువ సభలో మమతా బెనర్జీ పార్టీ ఎంపీల సంఖ్య కేవలం 10కి పరిమితమైంది.
మమతా బెనర్జీకి మరో షాక్.
393
previous post