ప్రపంచదేశాల్లో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని నిపుణులంతా చెబుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. మూడోసారి తనకు అధికారం ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానంలోకి తీసుకు వెళ్లే పూచీ తనదని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో ప్రధాని సుడిగాలి పర్యటన జరిపారు. బెటుల్, షాజపూర్, జబువా ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఒక జ్ఞాని దేశంలోని ప్రజలంతా చైనా మొబైల్స్ వాడుతున్నారని చెప్పడం తాను విన్నానని, వీళ్లంతా ఏ ప్రపంచంలో ఉన్నారో తెలియదని, వాస్తవాన్ని చూడలేని వాళ్లని మోదీ విమర్శించారు. మొబైళ్ల తయారీలో భారత్ ప్రపంచ దేశాల్లో రెండో పెద్ద దేశమని అన్నారు.
National
సహారా గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రాణాంతక మెటాస్టాటిక్, బీపీ, మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన ఈ ఆదివారం కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌కు గురయ్యారని, చికిత్స పొందుతూ కన్నుమూశారని ఓ ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆయన మృతితో కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొంది. సుబ్రతా రాయ్‌కి భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ విదేశాల్లో ఉంటున్నారు. సుబ్రతా రాయ్ 1948లో బీహార్‌లోని అరారియాలో పుట్టారు. 1978లో ‘సహారా ఇండియా పరివార్’ ప్రారంభించడంతో ఆయన సక్సెస్ స్టోరీ మొదలైంది. కేవలం రూ.2,000 మూలధనంతో ప్రారంభినప్పటికీ వ్యవస్థాపకత విషయంలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సుబ్రతా రాయ్ కృషి చేశారు. లక్నోను కేంద్రంగా చేసుకొని కంపెనీ కార్యకలాపాలను నిర్వహించారు. అయితే ‘సహారా చిట్ ఫండ్ స్కామ్’ కేసులో కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది. సుబ్రతా రాయ్ మృతిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.
భారత్ గెలవకపోవడం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.ఈ ప్రపంచకప్‌లో అజేయంగా కొనసాగిన టీమ్ ఇండియాకు వాంఖడే స్టేడియం రికార్డులు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వాంఖడే వేదికగా ఇప్పటివరకు జరిగిన ఒక్క సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ టీమిండియా గెలవకపోవడమే అందుకు కారణం. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే మైదానంలో రేపు నవంబర్ 15న టీమిండియా న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టనుందా?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి ఇండియాపై నోరుపారేసుకున్నాడు. భారతదేశంపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందని, ప్రపంచంలోని పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాలను లెక్కచేయకుండా వ్యవహరించడం తీవ్ర ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు. దీనివల్ల మిగతా దేశాలకు ముప్పు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. భారత్ ను ఉద్దేశించి పరోక్షంగా ఆరోపణలు గుప్పించాడు. కెనడా పౌరుడిని విదేశీ ఏజెంట్లు కెనడా గడ్డమీద హత్య చేయడం తీవ్రమైన విషయమని చెప్పాడు. ఈ హత్య ఇండియన్ ఏజెంట్ల పనేనని ఆషామాషీగా చెప్పడం లేదని, తమ వద్ద సమాచారం ఉందని అన్నాడు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, బాధితుల విచారణకు సహకరించాలని భారత్ కు విజ్ఞప్తి చేశామన్నారు. అయితే, భారత్ నుంచి సరైన సహకారం అందడంలేదని విమర్శించారు. దీంతో ఈ అంశాన్ని అమెరికా సహా మిత్ర దేశాల దృష్టికి తీసుకెళ్లినట్లు ట్రూడో వివరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఐదుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయం కోసం వేడుకుంటూ రోదిస్తున్న బాధితురాలి వీడియో వైరల్ అయినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై అత్యాచారం ఆరోపణలతోపాటు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
Read Also..
Read Also..
దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సరయూ నది తీరంలో నిర్వహిచిన ఈ వేడుకలో భాగంగా ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. గతేడాది కంటే 6.47 లక్షల దీపాలను అధికంగా వెలిగించారు. ఇది ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ను సొంతం చేసుకుంది. ఈ ఫొటోలను పంచుకున్న మోదీ దీపోత్సవాన్ని అత్యద్భుతమైన, మరపురాని వేడుకగా అభివర్ణించారు. గతేడాది 15 లక్షల దీపాలు వెలిగించి నెలకొల్పిన రికార్డును ఈసారి అంతకుమించిన దీపాలతో అయోధ్య తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఈ కార్యక్రమంలో 25 వేల మందికిపైగా వలంటీర్లు భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది 51 వేల దీపాలు వెలిగించారు. ఆ తర్వాతి నుంచి ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది దీపోత్సవ్‌లో 50 దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్ కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో 40 మంది వరకు కార్మికులు చిక్కుకున్నారు. ఉత్తరకాశీలో సిల్క్యారా నుచి దండల్‌గావ్‌కు మధ్య ఈ టన్నెల్ ఉంది. చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 4 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. ఉత్తరకాశీ నుంచి యమునోత్రి ధామ్ వరకు 26 కిలోమీటర్ల ప్రయాణాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందించేందుకు ఓ పైప్‌ను ఏర్పాటు చేసి, వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సొరంగం తెరవాలంటే దాదాపు 200 మీటర్ల శ్లాబ్‌ను తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సొరంగంలో ఆక్సిజన్ పైపును పంపించడానికి, చిక్కుకుపోయిన కార్మికులకు సహాయం చేయడానికి ఇరుకైన మార్గాన్ని తవ్వారు.
వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపావళి వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు. బెంగళూరులోని ఓ హోటల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. టీమిండియా సభ్యులు అందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య, కూతురుతో కలిసి పాల్గొన్నారు. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆటగాళ్లంతా సంప్రదాయబద్ధంగా కుర్తీ, పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో భారత జట్టు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్ లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ప్లేయర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర టీంమెంబర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. చైనా బార్డర్ కు సమీపంలో ఉన్న ఈ ఏరియా అత్యంత కీలకమైన ప్రదేశానికి ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులు, అధికారులతో కలిసిపోయారు. దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు. ఏటా ఏదో ఒక బార్డర్ ఏరియాకు వెళ్లి పండుగ పూట సైనికులను కలుస్తున్నారు. సరిహద్దులను కాపాడేందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్న వారితో పండుగను సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు.
ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేసి, న్యాయం చేస్తామని ప్రకటించారు. న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉంది. మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాని మోదీ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా మని తెలిపారు. మీ హక్కుల సాధనలో తమ తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని మోదీ తెలిపారు. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు హైదరాబాద్ కు వచ్చారు ప్రదాని మోదీ. మొదటి సారి ఎల్హీ స్డేడియంలో ఏర్పాటు చేసిన సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. నేడు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభలో 3౦ ఏళ్ల మాదిగల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటింటారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ముందుకెళ్తుంన్నారు ప్రదాని మోదీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో పార్టీలు వచ్చాయని..ఏన్నో హామీలను ఇచ్చి మోసం చేసాయన్నారు. వారి తరుపున క్షమాపణ చేప్పేందుకు తాను వ్చచానన్నారు మోదీ. బీజేపీ అన్ని వర్గాలకు అండగా నిలిచిన పార్టీ అని తెలిపారు.
Read Also..
Read Also..






Total views : 197911