బీహార్ రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీలో ఆమోదముద్ర పడింది. కులాల వారీగా కోటా పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని కేబినెట్ ప్రతిపాదించిన రిజర్వేషన్ సవరణ బిల్లును తాజాగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం నితీష్ కుమార్ సభలో లేకుండానే అసెంబ్లీ బిల్లు పాస్ అవ్వడం విశేషం. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ కోటా 65శాతానికి పెరిగింది. అయితే రిజర్వేషన్ల సవరణ బిల్లులో ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రస్తావించకపోవడంపై బీజేపీ రాష్ట్ర అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమోదం పొందిన బిల్లు ప్రకారం. షెడ్యూల్డ్ కులాల వారికి 20 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కుతుంది. షెడ్యూల్డ్ తెగలు వారికి రెండు శాతం రిజర్వేషన్లు అందనున్నాయి. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. కాగా ప్రస్తుతం ఓబీసీలకు 12 శాతం, ఈబీసీలకు 18 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. ఇక ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి.
National
కేంద్రమంత్రి అమిత్ షా చత్తీస్ గఢ్ లోని జశ్పూర్ నియోజకవర్గం ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నక్సలిజాన్ని పారద్రోలుతామన్నారు అమిత్ షా. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో కుల మత విభేదాలు పెరిగిపోయాయన్నారు. సీఎం భూపేశ్ భగేల్ పై కూడా విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల కాలంలో చత్తీస్ గఢ్ లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. సీఎం భగేల్ కొన్ని వేల కోట్ల స్కామ్స్ లో పాలుపంచుకున్నారని ఆరోపించారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 4 నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 19 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో 15 సెషన్ల పాటు సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. అమృత కాల మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ సమావేశంలో అనేక వ్యవహారాలు చర్చకు రానున్నాయని పేర్కొన్నారు. టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా విషయం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని ఓ వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు చేసారు. ఇక, బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో తీసుకురాబోయే కొత్త చట్టాలపైనా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశాలున్నాయి.
బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యే నితీష్ కుమార్ మహిళలను, మానవ సంతోనోత్పత్తిని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారని బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు… నితీష్ కుమార్ వ్యాక్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు… ఏలూరు బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నితీష్ కుమార్ మహిళా జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు… ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని దానికి నిదర్శనమే బిజెపి మహిళా అధ్యక్షురాలు పై వైకాపా నేతలు అసత్య పదజాలంతో దూషిస్తున్నారని ఆయన మండిపడ్డారు… రాష్ట్రంలో జరుగుతున్న వైసిపి దాడులను బిజెపి చూస్తూ ఉందని త్వరలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటుండగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని గుణాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ తో మధ్యప్రదేశ్ లో అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ 20వేల కోట్ల నుంచి 80వేల కోట్లకు పెరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పీఎం ఉజ్వల, ఆవాస్ యోజన, మాతృవందన యోజన, లాడ్లీ బ్రాహ్మణ యోజన, లాడ్లీ లక్ష్మీ యోజన వంటి ఎన్నో పథకాలను మహిళల కోసమే ప్రవేశ పెట్టిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పార్టీకి నారీ శక్తి నుంచి ఆశీస్సులు లభిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read Also..
Read Also..
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే దేశంలోని బాబర్లు, ఔరంగజేబ్‌లను ప్రోత్సహించడమేఅని ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలపై దౌర్జన్యాలు మొదలవుతాయి. ఇటీవల కాంగ్రెస్ గెలిచిన కర్ణాటకలోనూ అదే జరిగింది. ఆ రాష్ట్రంలోని బాబర్లు, ఔరంగజేబులకు ఎక్కడి నుంచి ఆక్సిజన్ అందిందో తెలియదు కానీ, చెలరేగడం మొదలుపెట్టారు అని సీఎం హిమంత ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో హిమంత ప్రసంగించారు. అక్టోబర్ 18న ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో జరిగిన ఎన్నికల ర్యాలీలోనూ ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అక్బర్‌ను ఓడించి ఇంటికి పంపకపోతే కౌసల్య మాత భూమి అపవిత్రం అవుతుంది. ఒక అక్బర్‌ను ఎక్కడో ఒకచోట అనుమతిస్తే.. అతడు 100 మంది అక్బర్లను పిలుచుకుంటాడు. కాబట్టి అతన్ని వీలైనంత త్వరగా పంపేయాలి అని అప్పట్లో హిమంత పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు కూడా పంపింది. అయినా అసోం సీఎం మళ్లీ అదే తరహా కామెంట్స్‌ను చేయడం గమనార్హం.
ఎన్నికల్లో ఉచిత హామీలకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చగలమా? లేదా? అందుకు తగిన ఆర్థిక వనరులు ఉన్నాయా? అని అంచనా వేయకుండానే పార్టీలు ఉచిత హామీలు గుప్పిస్తుంటాయని విమర్శించారు. దేశంలో పేద, మధ్య తరగతి, అంతకంటే దిగువన ఎంతోమంది జీవిస్తున్నారని పేర్కొన్న ఆయన.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ హామీపై మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని హామీని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ ఒక్క ఢిల్లీ ప్రభుత్వానిదే కాదని, కేంద్రంతోపాటు పక్క రాష్ట్రాలూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని, రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహిళలకు క్షమాపణ చెప్పారు. అసెంబ్లీలో తన స్పీచ్ పై ఆయన బుధవారం మీడియా ముందు స్పందించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరినీ కించపరచాలని అనుకోలేదని, సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను చెప్పే క్రమంలో అలా మాట్లాడానని వివరించారు. ఏదేమైనా తన స్పీచ్ తో బాధపడిన మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ స్పీచ్ పై ప్రతిపక్ష బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. నితీశ్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనపై నితీశ్ కుమార్ స్పందిస్తూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల అభ్యంతరాలపై మీడియా ముందే వివరణ ఇచ్చినట్లు తెలిపారు. నితీశ్ కుమార్ స్పీచ్ చూసి ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని బీజేపీ నేతలు విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాటలు విన్న వారందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితని మండిపడ్డారు. నితీశ్ మైండ్ పనిచేయడంలేదని, ఆయన స్టేట్ మెంట్ మరీ థర్డ్ గ్రేడ్ గా ఉందని విమర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. పంజాబ్ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత () వల్ల వెలువడుతున్న దట్టమైన పొగలు ఢిల్లీలో కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి. దాంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉన్నది.ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ విషయమై ఢిల్లీతోపాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రతినిధులు సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరుగుతున్న మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే సుక్మా జిల్లా తొండమర్కలో జరిగిన ఈఐడీ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత జవాను సీఆర్పీఎఫ్ కోబ్రా 206వ బెటాలియన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ అని అధికారులు తెలిపారు. నక్సల్స్ పాతిపెట్టిన బాంబుపై కాలు వేయడంతో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. నేడు ఎన్నికలు జరుగుతున్న 20 నియోజకవర్గాల్లో పేలుడు జరిగిన కొంటా అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉంది.




Total views : 196363