Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh చంద్రబాబు పేరుతో విడుదలైన ఒక ఫేక్ లెటర్ – షేర్ చేసిన నారా లోకేష్..

చంద్రబాబు పేరుతో విడుదలైన ఒక ఫేక్ లెటర్ – షేర్ చేసిన నారా లోకేష్..

by Satya
Nara Lokesh

టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చేసిన పని అని లోకేష్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఈ నకిలీ లెటర్ పై టీడీపీ కూడా మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే సీఎం జగన్‌ నైజమని టీడీపీ విమర్శించింది. ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. జగన్‌కు ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ నకిలీ లేఖ చెబుతోందని విమర్శించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: