Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home National మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

by Satya
Sensational decision of Manipur government

మణిపూర్ ప్రభుత్వం(Manipur government):

మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సరైన కారణం లేకుండా కార్యాలయాలకు డుమ్మా కొడుతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు ‘నో వర్క్-నో పే(No Work-No Pay)’ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరు కాని రోజును ఆబ్సెంట్‌గా పరిగణించి ఆ రోజు వేతనాన్ని జీతం నుంచి మినహాయిస్తారు.

మణిపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ‘నో వర్క్-నో పే’ రూల్..

రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్య కారణంగా కార్యాలయాలకు హాజరుకాని అధికారులను డిప్యూటీ కమిషనర్లు, లైన్ డిపార్ట్‌మెంట్లు ఫీల్డ్ లెవల్ కార్యాలయాలకు అటాచ్ చేస్తామని ముఖ్య కార్యదర్శి వినీత్ జోషీ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అక్కడి నుంచి వారు విధులు నిర్వర్తించుకోవచ్చని తెలిపారు. అటాచ్ చేసిన అధికారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లడం లేదని, విధులకు హాజరుకావడం లేదని తెలిసిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి వారికి ‘నో వర్క్-నో పే(No Work-No Pay)’ నిబంధన అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లు అందరూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సర్క్యులర్‌లో ఆదేశించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: రాహుల్ బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త…


భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ …
బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ …
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009371
Total views : 62084

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.