ఒక వైపు అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసిన రోజునే విశాఖలోని పార్టీ ఆఫీస్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాల కూల్చివేత పూర్తయిన వెంటనే విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఎండాడ వద్ద వంద కోట్లకు పైగా ఖరీదైన రెండుఎకరాల స్థలాన్ని ఎకరానికి ఏడాదికి వెయ్యికి చొప్పున లీజుకు తీసుకుని భవనాన్ని కట్టేశారు. వంద కోట్లతో కట్టిన ఆ భవనానికి ఒక్కటంటే ఒక్క పర్మిషన్ తీసుకోలేదు. దీంతో నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వం మారిన తర్వాత కూడా పర్మిషన్లు తీసుకోకపోగా… ఏం చేస్తారో చేసుకోండన్నట్లుగా వ్యవహరించారు. ఏదో అనుమానం ఉన్నట్లు భావించి.. రాత్రికి రాత్రి పర్మిషన్ల కోసం దరఖాస్తులు చేశారు. కింది స్థాయి అధికారులతో అనుమతుల కోసం రెండు దశలు దాటించారు. ఆన్ లైన్ లాగిన్ లో ఇద్దరు అధికారులు ప్లాన్లు అప్రూవ్ చేసేందుకు ప్రయత్నించారు. ఇదంతా కలెక్టర్ మల్లిఖార్జున ఆధ్వర్యంలో సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ ఆఫీసును కూడా కట్టేసిన తర్వాత లీగల్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం మారినా ఆయన తీరు మారలేదన్న నిర్మాణాలకు అనుమతుల్లేవా? ఆక్రమించి కట్టారా? ఆరోపణలు వస్తున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 91126