Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh పాలకొల్లు: ఉపాధ్యాయుడిపై మాజీ విద్యార్థి ఘాతుకం…

పాలకొల్లు: ఉపాధ్యాయుడిపై మాజీ విద్యార్థి ఘాతుకం…

by CVR NEWS

గురువుపై కక్షగట్టిన ఓ విద్యార్థి కిరాతకానికి ఒడిగట్టాడు. మంచి మార్గంలో నడవాలని చెప్పినందుకు రెండేళ్లపాటు మనసులో పగ పెంచుకుని, అదను చూసి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో జరిగిన ఈ ఘటన విద్యాశాఖలో కలకలం రేపుతోంది.పాలకొల్లు మండలం లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుక్కల రాజా వెంకట సురేష్‌పై సోడదాసి ఆర్యదీప్ అనే యువకుడు దారుణంగా దాడి చేశాడు. రెండేళ్ల క్రితం ఆర్యదీప్ అదే స్కూల్లో చదువుతున్నప్పుడు.. తోటి విద్యార్థుల ప్లేట్లలో భోజనం లాక్కుని తినడంపై సురేష్ మాస్టర్ మందలించి, ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి మాస్టర్‌పై కక్ష పెంచుకున్న ఆర్యదీప్.. నేడు సమయం చూసి ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సురేష్ మాస్టర్ తల, చేయి, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. సహచర ఉపాధ్యాయులు వెంటనే ఆయనను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరం గురించి తెలుసుకున్న డీఈఓ నారాయణ ఆసుపత్రికి చేరుకుని బాధిత ఉపాధ్యాయుడిని పరామర్శించారు. పాఠశాల పరిసరాల్లో ఇలాంటి ఘటనలు జరగడంపై ఉపాధ్యాయ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: