Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh పారిశ్రామికవేత్తలతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక భేటీ..

పారిశ్రామికవేత్తలతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక భేటీ..

by CVR NEWS

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. పారిశ్రామికవేత్తలకు కీలక హామీలు ఇచ్చారు. పెట్టుబడిదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కాకుండా, రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు తగ్గించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని స్పష్టం చేశారు. శ్రీసిటీలో కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలపై మంత్రి చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి విద్యుత్ కోతలు లేని సరఫరానే ప్రధానమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోందని, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీసిటీలో ప్రస్తుతం 70 వేల మందికి ఉపాధి లభిస్తుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను ఒకటిన్నర లక్షలకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.ముఖ్యంగా, గత ప్రభుత్వాల హయాంలో పెరిగిన భారాన్ని తగ్గించేలా.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ చార్జీలను ‘ట్రూ డౌన్’ చేశామని గుర్తు చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రజలకు, పరిశ్రమలకు విద్యుత్ చార్జీల భారం తగ్గించి తీరుతామని మంత్రి భరోసా ఇచ్చారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలకు విద్యుత్ రాయితీలు ఇస్తామని, ఏపీని ఇన్వెస్టర్ల స్వర్గధామంగా మారుస్తామని గొట్టిపాటి రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: