జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికారులను కించపరిచేలా జనసేన నేతలు, కార్యకర్తలు మాట్లాడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఏపీ పాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలవాలి. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీ నియమనిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో ఎవరు మాట్లాడినా, అధికారుల పనితీరును బలహీనపరిచేలా మాట్లాడినా, నిరాధార ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాదు, ప్రోటోకాల్ కు విరుద్ధంగా అధికారిక సమావేశాల్లో పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రోటోకాల్ గీత దాటే వారి పైనా చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ తన జనసేన శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్‌స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్‌ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
- అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సుల ప్రమాదం కలకలం రేపింది. గాలివీడు మండలం అరవీడు గ్రామం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.ప్రమాదం…
- విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొందారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భజనల నడుమ…
- గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు..గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నవంబర్‌లో నిర్వహించే దిశగా అధికారులు ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తైన వెంటనే జీహెచ్‌ఎంసీకి ప్రత్యేకంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పాలనా సౌలభ్యం…
- ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్‌ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్‌నాథ్ , జోషిమఠ్, గోవింద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 89300