పర్యావరణాన్ని పరిరక్షించి, జీవవైవిధ్యాన్ని కాపాడినప్పుడే ‘వసుధైక కుటుంబం’ అనే పేరు సార్థకమవుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం రూపొందించిన మెరైన్ ఫానా యాప్‌ను పవన్ ప్రారంభించారు. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్‌ని ఆయన ఆవిష్కరించారు.
వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజయం సాధించిన వారికి పవన్ బహుమతులు ప్రదానం చేశారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్‌ని నిర్మూలించాలన్నారు. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్…
- అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…
- నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. ఆ బెదిరింపులకు…
- సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని…
- అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి